Phone: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు
ఫోన్ అధికంగా చూసేవాళ్లకి ఇదొక హెచ్చరిక... మరీ అధికంగా చూశారో రోగాలు దాడి చేయడానికి రెడీగా ఉంటాయి.
డిజిటల్ యుగంలో చేతిలో ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్లు ఉండాల్సిందే. నిద్రపోతున్న సమయంలో తప్ప మిగతా అన్ని సమయాల్లో ఫోన్ పై చేతి వేళ్లు ఆడుతూనే ఉంటున్నాయి. కేవలం యువత మాత్రమే కాదు, పిల్లల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆన్‌లైన్ క్లాసుల వల్ల పిల్లలు మొబైల్‌కు మరింతగా అలవాటు అయిపోయారు. స్క్రీన్ సమయం అధికంగా గడిపితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
ఊబకాయం
స్క్రీన్ లు చూస్తూ గంటలకొద్దీ గడపడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. కేవలం బరువు పెరగడమే కాదు, అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. వెబ్ సిరీస్‌లు చూస్తూ రోజూ గంటల కొద్దీ కదలకుండా కూర్చునే వారు కొన్ని వారాల్లోనే బరువు పెరిగిపోతున్నారు. గేమ్ లు ఆడడం, టీవీ చూడడం కూడా ఈ పరిస్థితికి కారణమే. స్క్రీన్ కు అలవాటు పడిన వారు వాకింగ్, వ్యాయామం వంటివి చేయరు.
కంటి చూపు సమస్యలు
స్క్రీన్ ను అధికంగా చూడడం మీ కంటిచూపుపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. అందుకే టీవీ, ఫోన్ ఎక్కువ చూసేవారికి కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. అధిక సమయం స్క్రీన్ చూసే వారిలో ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒత్తిడి, డ్రై ఐస్ (పొడి కళ్లు), అస్పష్టమైన చూపు, తలనొప్పి వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి కంటి ఆరోగ్యానికి ఫోన్ ను చూడడం తగ్గించాలి.
సంబంధాలు చెడిపోతాయి...
ఎక్కువసేపు ఫోన్ చూసేవారిలో కరుణ, జాలి, దయ వంటి గుణాలను ఫీలవ్వడం తగ్గిపోతుంది. మొండిగా తయారవుతారు. దీంతో ఎదుటివారితో సంబంద బాంధవ్యాలపై ఈ ప్రభావం పడుతుంది. స్క్రీన్ సమయం ఎక్కువ గడుపుతున్నప్పుడు మీ ప్రియమైనవారితో గడిపే అవకాశం తగ్గిపోతుంది.
నిద్ర తగ్గుతుంది
స్క్రీన్‌ల నుంచి వెలువడే నీలి కాంతి శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. తద్వారా మీకు నిద్ర రావడం కష్టమవుతుంది. అందుకే నిద్రకు ఒక గంట ముందే అన్ని గాడ్జెట్లను స్విచ్ ఆఫ్ చేయాలి. నిద్ర తగ్గితే ఆ ప్రభావం ఆరోగ్యంపై చాలా పడుతుంది.
మెడనొప్పి, వెన్ను నొప్పి
ఫోన్ చూస్తూ ఒకే భంగిమలో అలానే ఉండిపోతారు చాలా మంది. దీనివల్ల మెడనొప్పి, వెన్నునొప్పి లాంటివి మొదలవుతాయి. చేయినొప్పి కూడా మొదలవుతాయి. ఇవి ఒకసారి ప్రారంభమైతే దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడతాయి.
Also read: కుకీలు, బిస్కెట్లు మిగిలిపోయాయా... వాటితో ఈ సింపుల్ రెసిపీలు చేసుకోవచ్చు
Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?
Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి
Also read: ముప్పై ఆరుకోట్ల మంది మాట్లాడే హిందీ, మనదేశ అధికార భాష, కానీ జాతీయ భాష కాదు
Also read: ఫేక్ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయన ఫలితం
Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే
Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.