Noida couple : అడల్ట్ కంటెంట్ కుటీర పరిశ్రమ పెట్టుకున్న జంట - కోట్లు సంపాందించేస్తున్నారు- ఎలా దొరికారంటే
Adult Couple: అడల్ట్ కంటెంట్ వెబ్ సైట్లకు కంటెంట్ ఇచ్చేందుకు ఇంట్లో స్టూడియో పెట్టుకున్నారు. మోడళ్లకు డబ్బులు ఇస్తూ వాళ్లతో షూట్ చేయించారు. చివరికి దొరికిపోయారు.

Adult videos for pornography websites: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోయిడాకు చెందిన ఒక జంటను అరెస్టు చేసింది. వారు మోడల్స్‌ను జీతానికి పెట్టుకుని వారి ద్వారా అడల్ట్ కంటెంట్ వీడియోలు తయారు చేసి .. పోర్నోగ్రఫీ వెబ్ సైట్స్ కు అమ్ముతున్నారు. ఆ జంట ఆ వీడియోలను అంతర్జాతీయ అశ్లీల సైట్‌లను హోస్ట్ చేయడానికి ప్రసిద్ధి చెందిన సైప్రస్‌కు చెందిన ‘టెక్నియస్ లిమిటెడ్’ కంపెనీకి అమ్ముతున్నారు.
సోషల్ మీడియా ద్వారా డబ్బులు ఆశ చూపి మోడల్స్ ను ఎంపిక చేసుకుటున్నారు. వారితో పూర్తి స్థాయి అడల్ట్ వీడియోలను రూపొందిస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ఇందు కోసం "అధునాతన" అడల్ట్ వెబ్‌క్యామ్ స్ట్రీమింగ్ స్టూడియోను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. టెక్నియస్ లిమిటెడ్ అనేది Xhamster , Stripchat వంటి అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌ల "ఆపరేటర్" అని ED ప్రకటించారు.
ప్రకటనలు, మార్కెట్ పరిశోధన , ప్రజాభిప్రాయ సేకరణ వంటి సేవల ముసుగులో సబ్‌డిజి అనే కంపెనీని ఈ జంట ప్రారంభించింది. ఈ కంపెనీకి పెద్దగా కార్యకలాపాలు లేకపోయినా విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు వస్తున్నట్లుగా గుర్తించారు. ఎందుకు వస్తున్నాయా అని ఈడీ ఆరాతీసింది. దాంతో అసలు విషయం బయటపడింది. XHamsterకు అమ్మిన అశ్లీల వీడియోలకు సంబంధించిన డబ్బులను సబ్ డిజీ కంపెనీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. అశ్లీల వీడియోలను తయారు చేయడం ఈడీ పరిధిలోకి రాదు కానీ.. ఆ కంటెంట్ ను అమ్మడం ద్వారా విదేశాల నుంచి నగదు స్వీకరించడం ఫెమా ఉల్లంఘనల కిందకు వస్తుంది. అందుకే కేసులు నమోదు చేశారు.
Noida: The Enforcement Directorate (ED) on Friday raided the premises of a Noida-based couple who allegedly shot adult videos with models at their residence and supplied those to a Cyprus-based company known for hosting international pornographic sites. Ujjwal Kishore and his… pic.twitter.com/pp1ncAVU54
— Tanseem Haider तनसीम हैदर (@TanseemHaider) March 29, 2025
అడల్ట్ కంటెంట్ తయారు చేస్తున్న కంపెనీ దాని డైరెక్టర్ల బ్యాంకు ఖాతాలలో మొత్తం 16 కోట్లు అక్రమంగా జమ అయినట్లుగా గుర్తించారు. అలాగే నెదర్లాండ్స్‌లో ఒక బ్యాంకు ఖాతాను గుర్తించారు. అక్కడ టెక్నియస్ లిమిటెడ్ సుమారు 7 కోట్లను బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విదేశీ బ్యాంకు ఖాతాలోని క్రెడిట్‌లను భారతదేశంలో అంతర్జాతీయ డెబిట్ కార్డులను ఉపయోగించి నగదు రూపంలో ఉపసంహరించుకున్నట్లుగా ఈడీ గుర్తించింది.
ఈ జంట మోడళ్లకు చాలా పరిమితంగానే ఇస్తున్నారు. ఎక్కువ భాగం తమ లాభాల కిందనే ఉంచుకుంటున్నారు. దాడుల సమయంలో దంపతుల నివాసంలో కొంతమంది మోడళ్లు దొరికారు. వారు అడల్ట్ కంటెంట్ షూటింగ్ లో ఉన్నట్లుగా గుర్తించారు. ఈడీ సెర్చ్ టీమ్ అధికారులు వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.





















