త్వరలో మార్కెట్లోకి కొత్త Skoda Kushaq.. పనోరమిక్ సన్‌రూఫ్ సహా లెవెల్-2 ADAS ఫీచర్లు
కొత్త Skoda Kushaq 2026లో ఫేస్‌లిఫ్ట్‌తో భారత మార్కెట్లోకి విడుదల కానుంది. పనోరమిక్ సన్‌రూఫ్, ADAS, కొత్త వీల్స్, డిజైన్ అప్‌డేట్స్ స్కోడా కొత్త మోడల్‌లో ఉంటాయి.

Skoda కంపెనీ తమ మిడ్ సైజ్ SUV Kushaqని పెద్ద అప్‌డేట్‌తో మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. 2021లో తొలిసారిగా ప్రారంభించిన తర్వాత, దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జనవరి 2026లో రాబోతోంది. ఈ కొత్త మోడల్ Skoda Kushaqలో డిజైన్ నుండి ఫీచర్‌ల వరకు, గేర్‌బాక్స్ వరకు పలు విషయాల్లో అప్‌గ్రేడ్ చేశారు. దాంతో ఈ SUV గతంలో కంటే మరింత మోడ్రన్‌గా కనిపించనుంది. స్కోడా కుషక్ ఫీచర్లపై ఒక లుక్ వేద్దాం.
కొత్త Skoda Kushaq డిజైన్
కొత్త Skoda Kushaqలో కంపెనీ ఫ్రంట్ డిజైన్‌లో మార్పులు చేస్తోంది. దీని హెడ్‌లైట్‌లు, ఫాగ్ లాంప్‌లకు కొత్త షార్ప్ డిజైన్ ఇస్తున్నారు. దీనితో SUV ఫ్రంట్ మరింత శక్తివంతంగా కనిపిస్తుంది. ఫ్రంట్ గ్రిల్‌ను కూడా సన్నని నిలువు స్లాట్‌లతో అప్‌డేట్ చేసే ఛాన్స్ ఉంది. దాని లుక్ మరింత మోడ్రన్ చేస్తుంది. కొత్త Kushaqలో Skoda Kodiaq వంటి కనెక్టెడ్ DRL సెటప్, వెడల్పాటి ఎయిర్ డ్యామ్, కొత్త 17-అంగుళాల మ్యాట్-బ్లాక్ అల్లాయ్ వీల్స్ కూడా చేర్చవచ్చు. వెనుక భాగంలో స్లిమ్ LED టెయిల్-ల్యాంప్‌లు, కనెక్టెడ్ LED స్ట్రిప్ SUVకి మరింత ప్రీమియం స్టైల్‌ను ఇస్తాయి. మొత్తంమీద కొత్త Kushaq చూడటానికి మరింత ఆకర్షణీయంగా, గతంలో కంటే కూడా స్టైలిష్‌గా ఉంటుంది.
ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్, Level-2 ADAS సౌకర్యం
ఇంటీరియర్‌లో Skoda అనేక కొత్త అప్‌డేట్‌లను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. స్కోడా మొదటిసారిగా Kushaqలో పనోరమిక్ సన్‌రూఫ్ లభించనుంది. దీనితో దాని క్యాబిన్ మరింత ఓపెన్‌గా, అదే సమయంలో మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. అలాగే, కొత్త ఇంటీరియర్ ట్రిమ్, కలర్ ఆప్షన్ క్యాబిన్‌ను మరింత మెరుగుపరుస్తాయి. కొత్త మోడల్‌లో అతిపెద్ద మార్పు Level-2 ADAS ఫీచర్. ఇందులో ఆటో బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్, అనేక భద్రతా సౌకర్యాలు, ఫీచర్లు ఉంటాయి. దీనితో పాటు, 360 డిగ్రీల కెమెరాను కూడా అందిస్తుంది. దీనితో ఇరుకైన ప్రదేశాలలో కూడా డ్రైవింగ్ చేయడం సులభం అవుతుంది.
ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలు
కొత్త Kushaqలో గతంలోలాగే రెండు ఇంజిన్ ఎంపికలు ఉంటాయి. 1.0 TSI, 1.5 TSI. అయితే ప్రత్యేకత ఏమిటంటే 1.0 TSI ఇంజిన్‌తో కొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనితో మీ డ్రైవింగ్ సాఫీగా ఉంటుంది. ఈ కారులో మైలేజ్ కూడా మెరుగ్గా ఉంటుంది. అదే సమయంలో 1.5 TSI ఇంజిన్‌లో DCT గేర్‌బాక్స్ గతంలో ఇచ్చినట్లే ఇస్తారని భావిస్తున్నారు.
కొత్త Kushaq ఎవరికి సరైనది?
2026 Kushaq Facelift స్టైలిష్, సురక్షితమైన, ఫీచర్ రిచ్ SUVని కోరుకునే వారికి మంచి ఎంపిక అవుతుంది. డిజైన్, టెక్నాలజీ, గేర్‌బాక్స్‌లో రాబోయే మార్పులు దాని విభాగంలో మరింత పటిష్టం చేయనున్నాయి. చాలా కంపెనీలు గతంలో విడుదలైన మోడల్ లో స్వల్పమార్పులు చేసి ఫేస్ లిఫ్ట్ మోడల్ అని రిలీజ్ చేసి విక్రయాలు పెంచుకుంటున్నాయి. ఇదే తరహాలో స్కోడా Kushaq పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 ADAS ఫీచర్లతో విడుదల చేస్తున్నారు.






















