అన్వేషించండి

హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టనున్న MG Hector Facelift.. త్వరలో మార్కెట్లోకి, ఫీచర్లు చూశారా

ఎంజీ నుంచి వచ్చిన తొలి ఎస్‌యూవీ హెక్టర్. మోడ్రన్ లుక్ ఇవ్వడంతో పాటు కొన్ని ఫీచర్లలో కంపెనీ మార్పులు చేసింది. త్వరలో మార్కెట్లోకి రానున్న ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ క్రెటాకు పోటీ ఇవ్వనుంది.

MG Hector Facelift in India | భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్ల కంపెనీలలో జేఎన్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఒకటి. పెట్రోల్, డీజిల్ నుండి ఎలక్ట్రిక్ కార్ల వరకు ప్రతి విభాగంలోనూ కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. 2019లో వచ్చిన MG మొదటి SUV హెక్టర్. ఇప్పటికీ కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఇప్పుడు MG హెక్టర్ కొత్త మోడల్ 2026లో రాబోతోందని సమాచారం. ఇది పాత మోడల్ కంటే మరింత మోడ్రన్‌గా ఉంటుంది. కంపెనీ SUV డిజైన్‌లో మార్పులు చేస్తోంది. తద్వారా కొత్త మోడల్  Hyundai Cretaకి పోటీ ఇవ్వనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. 

కొత్త లుక్‌లో హెక్టర్ ఎలా కనిపిస్తుంది?

2023లో ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వచ్చింది. 2026లో రాబోయే అప్‌డేట్ దానిపైనే తయారు చేశారు. ఈసారి హెక్టర్ బయటివైపు లుక్ కొద్దిగా మార్చుతారు, కానీ ఆకర్షణీయంగా ఉండనుంది. ఇందులో కొత్త గ్రిల్ అమర్చుతారు. ఇది మునుపటి కంటే పెద్దదిగా, స్టైలిష్‌గా ఉంటుంది. SUV ముందు భాగాన్ని మరింత శక్తివంతంగా చూపించడానికి దాని ఫ్రంట్ బంపర్‌ను కొద్దిగా మారుస్తారు. దీని LED హెడ్‌లైట్‌లు ఎప్పటిలాగే సన్నగా ఉంటాయి. ఇవి హెక్టర్ గుర్తింపుగా మారాయి. వెనుక వైపున కూడా కొత్త బంపర్ డిజైన్ ఇవ్వనున్నారు. ఇది కారు వెనుక భాగాన్ని మరింత మోడ్రన్‌గా చేస్తుంది. ప్రత్యేకమైన మార్పు దాని కొత్త అల్లాయ్ వీల్స్‌లో చూడవచ్చు. ఈసారి ఎంజీ హెక్టర్ 19-అంగుళాల పెద్ద వీల్స్ తో వస్తుందని అంతా భావిస్తున్నారు.

ఎంజీ హెక్టర్ ఫీచర్లు 

ఎంజీ హెక్టర్ ఎల్లప్పుడూ ఫీచర్-రిచ్ SUVగా పరిగణిస్తారు. కంపెనీ దాని ఫీచర్లలో చాలా వరకు మునుపటిలాగే ఉంచుతుంది. కస్టమర్‌లు వాటిని బాగా లైక్ చేస్తున్నారు. అయినప్పటికీ వెనుక సీటులో వెంటిలేషన్ వంటి కొన్ని కొత్త ఫీచర్‌లు జత చేయవచ్చు. పెద్ద వర్టికల్ టచ్‌స్క్రీన్‌లో కూడా కొత్త ఇంటర్‌ఫేస్ ఉంటుంది. దీన్ని ఈజీగా ఉపయోగించవచ్చు. దీనితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్‌లు ఉంటాయి. MG  ప్రత్యేకమైన i-SMART సాంకేతికత ఇందులో ఉంటుంది. దీని ద్వారా మీరు కారును లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం, కండీషన్ చెక్ చేయడం, లేదా వాయిస్ కమాండ్ ఇవ్వడం వంటి పనులను మీ మొబైల్ నుండే ఆపరేట్ చేయవచ్చు.

ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయి?

ఎంజీ హెక్టర్ కేవలం ఫేస్‌లిఫ్ట్ మాత్రమే, పూర్తిగా కొత్త మోడల్ కాదు. కనుక కొత్త మోడల్ కారులో ఇంజిన్‌లో పెద్ద మార్పులు చేసే అవకాశం తక్కువ. 2026 హెక్టర్‌లో గతంలోలాగే ఇంజిన్‌లు ఉంటాయి. 1.5-లీటర్ టర్బో పెట్రోల్, ఇది 141 bhp పవర్, 250 Nm టార్క్ ఇస్తుంది. 2.0 లీటర్ టర్బో డీజిల్, ఇది 167 bhp పవర్, 350 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్‌తో 6 స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ రెండూ ఉంటాయి. డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget