Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 21st: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఫైర్ బ్రాండ్ అంబాసిడర్‌లా విహారి విశ్వరూపం.. సహస్ర, స్వీటీలకు ఫుల్ కోటింగ్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం పడిపోతే విహారి పట్టుకోవడం స్వీటీ ఆ సీన్ ఫొటోలు తీసి బిగ్ స్క్రీన్ మీద ఫొటోలు వేయడంతో విహారి గోల గోల చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode శుభలేఖలో యమున పేరు తీసేస్తా అని పద్మాక్షి అంటుంది. తన పేరు లేకపోయినా పర్లేదు కానీ పెళ్లి సక్రమంగా జరిగిపోవాలని యమున అంటుంది. దానికి వసుధ అక్కతో వదిన పేరు తీసేస్తే నీ అహం చల్లారుతుందేమో కానీ పెళ్లి ఆగిపోతుందని అంటుంది. పద్మాక్షి షాక్ అయిపోతుంది.
వసుధ: నిశ్చితార్థంలో తన తల్లి ఎదురుగా లేదని సహస్రకి రింగే తొడగలేదు విహారి. అలాంటిది ఇప్పుడు శుభలేఖలో పేరు లేకపోతే తాళి కడతాడు అనుకుంటున్నావా. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తే అది పెళ్లి ఆగిపోయే వరకు వెళ్తుంది. సహస్ర జీవితాంతం కన్నీరు పెట్టుకునే పరిస్థితి తీసుకురాకు. పద వదినా.
పద్మాక్షి: ఛా..
పార్టీలో ఏదో డ్రింక్ లేదని బేరర్ లక్ష్మీని లోపలికి పంపిస్తాడు. లక్ష్మీ వెళ్తుంది. ఇంతలో లక్ష్మీ దగ్గరకు సహస్ర ఫ్రెండ్ వచ్చి అగ్గిపెట్టి ఉందా లైటర్ ఉందా అని అడుగుతుంది. అవేమీ లేవని లక్ష్మీ వెళ్లిపోతుంది. తర్వాత మరో వ్యక్తి వచ్చి ఆమెకు సిగరెట్ వెలిగిస్తాడు. ఇక లక్ష్మీ వచ్చి చూసి దేవుడి ఫొటోలు ఉన్నాయి స్మోక్ చేయొద్దని అంటుంది. ఆమె లక్ష్మీని తిట్టి ముఖం మీద పొగ విడుస్తుంది. లక్ష్మీ ఎంత చెప్పినా ఆమె వినకుండా లక్ష్మీతో సిగరెట్ తాగించాలని ప్రయత్నిస్తుంది. దాంతో లక్ష్మీ ఆమెను నెట్టేసి ఒక్కటిస్తుంది. మంచిగా ఉన్నంత సేపే మంచి దాన్ని అని వార్నింగ్ ఇచ్చి లక్ష్మీ వెళ్లిపోతుంది. దాంతో స్వీటీ వెళ్లేలోపు తనని కొట్టిన లక్ష్మీని ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది. ఇక పార్టీకి విహారి వస్తాడు. స్వీటీ మందు తీసుకెళ్తున్న లక్ష్మీని కింద పడేసి అవమానించాలని లక్ష్మీ కాళ్లకి అడ్డంగా కాలు పెడుతుంది. దాంతో పడిపోతున్న లక్ష్మీని విహారి పట్టుకుంటాడు. స్వీటీ విహారి లక్ష్మీని పట్టుకున్న సీన్ ఫొటో తీస్తుంది.
విహారి లక్ష్మీకి జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు. సహస్ర విహారిని చూసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అందరూ సహస్ర, విహారి డ్యాన్స్ చేయాలని అంటారు. దాంతో సహస్ర ఉండి పోవా నువ్విలా రెండు కళ్లలో ఇలా అని డ్యాన్స్ చేస్తుంది. విహారి కాస్త ఇబ్బంది పడతూనే స్టెప్పులేస్తాడు. లక్ష్మీ ఆ సీన్ చూసి బాధ పడుతుంది. రోహిత్ ఇంకో సర్‌ఫ్రైజ్ ఉందని సహస్ర, విహారిలతో పాటు అందరినీ లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ పెద్ద తెర మీద ఇద్దరి నిశ్చితార్థం ఫొటోలు వేస్తారు అందరూ చూసి క్లాప్స్ కొడతారు. ఇంతలో స్వీటీ విహారి, లక్ష్మీని పట్టుకున్న ఫొటో వేస్తుంది. లక్ష్మీ, విహారితో పాటు అందరూ షాక్ అయిపోతారు. సహస్ర కోపంతో రగిలిపోతుంది. అందరూ సహస్రతో మీ బావ పెళ్లి చేసుకోబోయేది నిన్నా ఆ అమ్మాయినా అని అడుగుతారు. దాంతో సహస్ర ఆపండి అని ఏడుస్తూ ఎవరూ ఆ ఫొటోలు వేస్తున్నారు అని అందరి ఫోన్లు చెక్ చేస్తుంది. స్వీటీ ఫొన్‌లో ఆ ఫొటోలు చూసి ఈ ఫొటోలు నీ ఫోన్‌లో ఎందుకు ఉన్నాయని అడుగుతుంది. ఇంతలో విహారి టేబుల్ పడేసి కోపంగా అలా అడుగుతావేంటి లాగి పెట్టి ఒక్కటి కొట్టి అడుగు అని అంటాడు.
లక్ష్మీ పడిపోతుంటే పట్టుకున్నా దాన్ని ఇలా పొటోలు తీయడం ఏంటి అని అరుస్తాడు. అందరి ముందు ఇలా చేయడం ఏంటి అని ఇదంతా కావాలనే ఇలా చేశావా అని అరుస్తాడు. స్వీటీ భయపడి సారీ చెప్తుంది. లక్ష్మీతో తనకు గొడవ అయిందని తన పరువు తీయడానికి ఇలా చేశానని చెప్తుంది. విహారి స్వీటీనికొట్టడానికి చేయి ఎత్తితే సహస్ర ఆపుతుంది. నువ్వు ఆడదానివేనా ఆడపుట్టుకే పుట్టావా అని అరుస్తాడు. ఇలాంటి ఫ్రెండ్స్ ఏంటి అని సహస్రకి రెండు అవుతాయి. సహస్ర విహారికి సారీ చెప్తుంది. లక్ష్మీని తీసుకొచ్చి స్వీటీ ముందు నిల్చొపెట్టి సారీ చెప్పమని అంటుంది. స్వీటీ సారీ చెప్తుంది. ఇక అంబిక రౌడీలకు ఫన్ చేసి విహారి చిన్న వాడు కాదని జాగ్రత్తగా పని పూర్తి చేయమని చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మరోసారి కన్నతండ్రిని చంపడానికి ప్రయత్నించిన జ్యోత్స్న.. ఉలిక్కిపాటు.. దీపకి అనుమానం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

