Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Allu Arjun Pushpa 2: మాస్... పుష్పరాజ్ మాస్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో 'పుష్ప 2' సినిమాలోని 'పీలింగ్స్' చూపించింది. ఇవాళ విడుదలైన లిరికల్ వీడియోలో ఉన్న విజువల్స్ చూస్తే అదుర్స్ అంతే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటనతో పాటు ఆయన డ్యాన్స్ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. టాలీవుడ్ టాప్ డ్యాన్సర్లలో ఒకరైన ఆయన నుంచి మాస్ డ్యాన్స్ చూసి కొన్నేళ్లు అయ్యింది. ఆ లోటు 'పీలింగ్స్'తో తీర్చేశారు. ఈ రోజు విడుదలైన ఆ సాంగ్ లిరికల్ వీడియో చూస్తే... అందులో ఉన్న విజువల్స్ కొన్నే అయినా డ్యాన్స్ ఏ రేంజ్ అనేది అందరికీ అర్థం అయ్యింది.
బన్నీతో పాటు రష్మిక కూడా కుమ్మేసింది
బన్నీతో మాస్ డ్యాన్స్ చేయడం, స్టెప్స్ వేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ, ఈ రోజు 'పుష్ప 2: ది రూల్' నుంచి విడుదల చేసిన మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' చూస్తే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా కుమ్మేసిందని, డ్యాన్సులో దుమ్ము దులిపేసింది చెప్పక తప్పదు.
'పుష్ప 2' నుంచి వచ్చిన సాంగ్స్ అన్నిటిలోనూ ట్యూన్స్ బావున్నాయి. చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యాయి. 'పుష్ప: ది రైజ్' సినిమాలోనూ సాంగ్స్ హిట్. 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' ఆడియన్స్ అందరినీ ఓ ఊపు ఊపేసింది. కానీ, అందులో బన్నీ డ్యాన్స్ అంత ఉండదు. క్యారెక్టర్ పరంగా డ్యాన్స్ చేయడం కుదరలేదని, కానీ 'పుష్ప 2'లో ఓ సాంగులో మాత్రం బాగా చేశారని కేరళలో అల్లు అర్జున్ చెప్పారు. ఆ పాటలో రష్మిక కూడా ఇరగదీసిందని చెప్పారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. 'పీలింగ్స్' పాట సూపర్ ఉందంతే!
It's time for the Mass Blockbuster Song to energize your playlist 🔥🔥#Peelings song out now❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) December 1, 2024
Telugu - https://t.co/PlNXxvf4kt
Hindi - https://t.co/oh1w8o9Cnw
Tamil - https://t.co/Bo2mn0K6XL
Malayalam - https://t.co/3lk4jlv6kQ
Kannada - https://t.co/aGMQUian15
Bengali -… pic.twitter.com/QuRC8tpYw9
'పుష్ప 2' అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తే...
దేశవ్యాప్తంగా 'పుష్ప 2: ది రూల్' అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని గంటల క్రితం మొదలు అయ్యాయి. ఈ శనివారం (నవంబర్ 30) నుంచి స్టార్ట్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే... మొదటి రోజు ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనబడుతోంది. బుకింగ్స్ మొదలు అయ్యాయో? లేదో? ఫ్యాన్స్, ఆడియన్స్ అలా టికెట్లు తీసుకోవడం మొదలు పెట్టారు.
Also Read: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో 'పుష్ప 2'కు భారీ వసూళ్లు వస్తాయి. ఫస్ట్ డే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ. తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్ షోలకు కనీవినీ ఎరుగని రీతిలో టికెట్ రేటు మీద మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్లలో రూ. 800 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దాంతో అఫీషియల్ బుకింగ్ యాప్స్ లో 1200లకు చేరుకుంది ఒక్కో టికెట్. ఈ రేటు అంటే రికార్డులు ఈజీ.