అన్వేషించండి

Allu Arjun - Chiranjeevi: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'

'గంగోత్రి'తో అల్లు అర్జున్ హీరో కావడం వెనుక ఓ చిరు కథ ఉంది. తన వందో సినిమాగా రాఘవేంద్రరావు ప్లాన్ చేసిన మెగా మల్టీస్టారర్ ఆగడంతో అల్లు అర్జున్ మొదటి సినిమా మెటీరియలైజ్ అయ్యింది. ఆ కథ ఏమిటో తెలుసా?

అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం దేశంలోనే టాప్ హీరోల్లో ఒకరు. పూర్తిస్థాయి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోగా ఆయన తన రేంజ్ చూపిస్తున్నారు. హీరోగా ఆయన మొదటి సినిమా 'గంగోత్రి' అన్న విషయం అందరికీ తెలిసిందే. కమర్షియల్ హిట్ తో పాటు మ్యూజికల్ హిట్ గానూ ఆ సినిమా నిలిచింది. తొలి సినిమాతో హిట్ కొట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత 'ఆర్య', 'బన్నీ' లాంటి సినిమాలతో హీరోగా తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'పుష్ప 2'పై దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే 'గంగోత్రి' సినిమా నిజానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించాల్సిన ఒక భారీ మల్టీ స్టారర్ ఆగిపోవడంతో మొదలైందని తెలుసా?

దర్శకేండ్రుడి 100వ సినిమాగా 'త్రివేణి సంగమం'
తెలుగు సినిమాకు గ్లామర్ అద్దిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు (K Raghavendra Rao) తన వందవ సినిమా కోసం రెడీ అవుతున్న రోజులవి. అప్పటికి ఆయన చివరి తెలుగు సినిమా 'మూడు ముక్కలాట' భారీ డిజాస్టర్ అయింది. అది డైరెక్టర్ గా 97 సినిమా. 98వ సినిమాగా కన్నడలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా శ్రీ మంజునాథ్ తీశారు. అందులో శివుడిగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్రలో నటించారు. 99వ సీనినమాగా హిందీలో తెలుగు సూపర్ హిట్ 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమాను రీమేక్ చేసారు. ఇక తన వందో సినిమాగా తెలుగులో భారీ హిట్ ఇవ్వడం కోసం ఆయన రెడీ అయ్యారు. దాని కోసం అప్పటికే 'నరసింహ నాయుడు', 'ఇంద్ర' లాంటి సినిమాలకు రచయితగా పని చేసిన చిన్ని కృష్ణ ఒక కథ రెడీ చేశారు. దానితో పాటే మరికొన్ని వెర్షన్ ల కథలూ రెడీ చేసుకున్నారు. అలా రూపుదిద్దుకున్నదే 'త్రివేణి సంగమం' (Triveni Sangamam). చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ హీరోలుగా సి అశ్వినీదత్ నిర్మాతగా ఆ సినిమాను డైరెక్ట్ చేయడానికి రాఘవేంద్ర రావు రెడీ అయ్యారు. సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే చివరి నిమిషంలో నిర్మాత అశ్వినీదత్ ఇంత పెద్ద భారీ మల్టీస్టారర్ వల్ల ఫ్యాన్ వార్స్ జరిగే ప్రమాదం ఉందని అంతకు ముందు 'వారసుడు' సినిమా విషయంలో ఇదే జరిగిందనీ చెప్పారు. పైపెచ్చు కథ కూడా ముగ్గురు టాప్ సార్స్ కు సరిపోయే రేంజ్ లో ఉండాలని లేకుంటే అంచనాలను అందుకోలేక ఇబ్బంది పడతామని అనడంతో రాఘవేంద్ర రావు ఆలోచనలో పడ్డారు.

'త్రివేణి సంగమం' ఆగింది... 'గంగోత్రి' మొదలైంది
వందో సినిమాగా కొత్త వాళ్లతో లిమిటెడ్ బడ్జెట్లో సినిమా తీస్తే అనవసర ఒత్తిడి ఉండదని అల్లు అరవింద్, అశ్వినీదత్ సలహా ఇవ్వడంతో రాఘవేంద్ర రావుకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. అంతకు ముందు అదే పద్ధతిలో తక్కువ బడ్జెట్లో 'పెళ్లి సందడి' సూపర్ హిట్ కొట్టిన ఆయన మళ్ళీ అలాంటి మ్యూజికల్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అప్పటికి అల్లు అరవింద్ తన కుమారుడు బన్నీని చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దానితో అతన్ని హీరోగా పెట్టి సినిమా తీద్దామని భావించిన రాఘవేంద్ర రావు దానికి తగ్గట్టు కథను రెడీ చేయమని చిన్ని కృష్ణను అడగడంతో రూపొందిన కథే 'గంగోత్రి'. హీరోయిన్‌గా అప్పటికి ఫుల్ క్రేజ్‌లో ఉన్న ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్‌ను ఎంచుకుని 'గంగోత్రి' షూటింగ్ ప్రారంభించారు రాఘవేంద్ర రావు. హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఇది తొలి సినిమా కావడంతో దీన్ని మ్యూజికల్ హిట్‌గా మార్చే భారం కీరవాణిపై పడింది. ఆయన రాఘవేంద్ర రావు నమ్మకాన్ని వొమ్మ చేయకుండా సినిమాకు సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ను ఇచ్చారు. అల్లు అరవింద్, అశ్వినీదత్‌లు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహారించారు. ప్రకాష్ రాజ్, తెలంగాణ శకుంతల, సుమన్, తనికెళ్ళ భరణి, సునీల్ లాంటి భారీ తారాగణంతో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వందో సినిమాగా రూపొందిన 'గంగోత్రి' సూపర్ హిట్ గా నిలవడంతో పాటు ఒక పాన్ ఇండియా స్టార్ తెలుగు తెరపైకి అడుగు పెట్టారు.

Also Read: 'బిగ్ బాస్'లో తెలుగు vs కన్నడ బ్యాచ్ రగడ... గొడవకు కారణం స్టార్ మా, బిగ్ బాసే కారణం కాదా?


తొలి సినిమాలో లుక్స్‌పై విమర్శలు...
కట్ చేస్తే స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు బన్నీ!
ఆ సినిమాలో హీరో లుక్స్‌పై విమర్శలు వచ్చినా తర్వాత కాలంలో తనను తాను ఒక స్టైలిష్ స్టార్‌గా మార్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్‌గా మారారు. యువతలో అల్లు అర్జున్ స్టైల్, డాన్స్, డ్రెస్సింగ్ సెన్స్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. మరో వారంలో రిలీజ్ కాబోతున్న 'పుష్ప 2'పై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇవన్నీ ఓకే గాని... ఒకవేళ దర్శకేంద్రుడి 100వ సినిమాగా 'త్రివేణి సంగమం' రూపొంది ఉంటే హీరోగా అల్లు అర్జున్ తొలి సినిమా ఏదై ఉండేదో... ఇప్పుడు ఆలోచిస్తే చిత్రంగా ఉంటుంది.

Also Readరోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Embed widget