Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Rohini Jabardasth: తనను లైట్ తీసుకోవడానికి వీల్లేదని రోహిణి రీసెంట్ గేమ్ ప్లాన్ చూస్తుంటే అర్థం అవుతోంది. ఆవిడ ఆడ పులిలా, శివంగిలా ఆడుతోంది. రోహిణి దెబ్బకు 'బిగ్ బాస్ 8'లో టాప్ 5 లెక్కలు మారిపోయాయి.

ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ (Bigg Boss 8 Telugu)లో ఆడపులిలా ఆడుతున్న రోహిణి దెబ్బకు టాప్ 5 లెక్కలు మారిపోతున్నాయి. పోయిన వారం వరకూ "నీలో ఫైర్ లేదు... ఫిజికల్ గా టాస్కులు ఆడలేవు" అంటూ ఎవరి విమర్శలు అయితే ఎదుర్కొందో అదే హౌస్ మేట్స్ ను ఫిజికల్ టాస్క్ లో ఓడించి మరీ తన సత్తా చాటింది రోహిణి.
పృథ్వీ లాంటి స్ట్రాంగ్ ఫిజికల్ ప్లేయర్ ను టాస్క్ లో ఓడించి మరీ హౌస్ కి చివర మెగా చీఫ్ అయిపోయింది. అంతే కాకుండా ఈ వారం నడుస్తున్న 'టికెటు టు ఫినాలే' టాస్కుల్లోనూ తనను కామెంట్ చేసిన విష్ణు ప్రియ లాంటి వాళ్ళను కూడా ఓడించి తొలి కంటెండర్ గా నిలిచింది. గతంలో ఆవిడ కాలికి ఆపరేషన్ అయి రాడ్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయినా గాని ఫిజికల్ టాస్కుల్లో సత్తా చూపుతూ శివంగి రోహిణి అని పేరు తెచ్చుకుంది.
హోస్ట్ నాగార్జున తో సహా హౌస్ లోకి వస్తున్న సెలబ్రిటీలు అందరూ ప్రస్తుతం రోహిణి నామస్మరణ చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే హౌస్ లో తేజాతో మాట్లాడుతూ తనలాంటి కమెడియన్స్ ను విన్నర్లుగా చూడలేరు అంటూ బాధపడిన రోహిణి దెబ్బకు ఇప్పుడు ఏకంగా టాప్ ఫైవ్ లెక్కలు మారిపోయాయి. నిన్న మొన్నటి వరకూ గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, పృథ్వీ / విష్ణు ప్రియ లాంటి వాళ్ల పేర్లు టాప్ 5లో కనిపించేవి. విష్ణు ప్రియ పెద్దగా ఆటలాడకపోయినా సోషల్ మీడియాలో ముందు నుంచి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెను సేవ్ చేసుకుంటూ వస్తుందని బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళకు అర్థం అవుతోంది. అయితే ఇప్పుడు రోహిణి ఆట తీరుతో టాప్ 5 లిస్టులో మార్పులు తప్పవని ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి. ఈవారం నామినేషన్స్ లో రోహిణి లేదు. టికెట్ టూ ఫీనాలే కంటెండర్ గానూ ఆమె ప్రస్తుతం పోటీ పడుతుంది. ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానితోపాటు రోహిణి గానీ టికెట్టు ఫినాలే రేసు గెలిస్తే మొత్తం లెక్కలే మారిపోతాయి.
అవమానాలే రోహిణిలో కసి పెంచాయా?
మొదట్లో తనను తాను తక్కువ అంచనా వేసుకున్న రోహిణి ఎంత కసిగా ఆడడానికి కారణం ఆమె ఎదుర్కొన్న అవమానాలే. పృద్వి, నబీల్ ల చిన్న చూపుతో పాటు విష్ణు ప్రియ తనను కించపరుస్తూ మాట్లాడిన మాటలు రోహిణిలో పట్టుదలను పెంచాయి. దానితో ఎలాంటి భయాలు లేకుండా టాస్కుల్లో తెగించి ఆడుతోంది రోహిణి.
ఆమె సడన్ రైజింగ్ తో పృద్వి,విష్ణు ప్రియ లతో పాటు ఈ వారం తన ఆటను చేజేతులా పాడు చేసుకున్న నబీల్ కూడా ఎలిమినేషన్ రిస్క్ లో ఉన్నారు. ఒకవేళ వీళ్ళలో ఎవరైనా ఎలిమినేట్ అయితే గౌతమ్, నిఖిల్లతో పాటు రోహిణి కూడా టాప్ 5లోకి దూసుకెళ్లే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద కమెడియన్ గా బిగ్బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి ప్రస్తుతం చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే రేంజ్ లో హౌస్ లో సత్తా చాటుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

