అన్వేషించండి

Bigg Boss Telugu Season 8: నచ్చితే ఉంచుతారు లేదంటే లేదు... అఖిల్‌తోనూ విష్ణు వాదన... టాస్కుల్లో రోహిణి దూకుడు

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ ఇంట్లో పదమూడో వారం టికెట్ టు ఫినాలే రేసు టాస్క్ జరిగింది. పాత కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, హారిక వచ్చి టాస్క్ లు పెట్టారు. రోహిణి అదరగొట్టేసింది.

Akhil Sarthak Vishnu Priya Issue And Rohini Wins Task: బిగ్ బాస్ ఇంట్లో పదమూడో వారం టికెట్ టు ఫినాలే రేసు టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో పాత కంటెస్టెంట్లు ఇంట్లోకి తీసుకొచ్చాడు. వారితో టాస్కులు పెట్టించాడు. ఈ క్రమంలో మొదటి రోజు అఖిల్ సార్థక్, హారిక వచ్చారు. వారు పెట్టిన టాస్కుల్లో రోహిణి అదరగొట్టేసింది. ఇక అఖిల్ కూడా ఏదో సలహా ఇవ్వబోతూంటే.. అక్కడ కూడా విష్ణు వాదనకు దిగింది. ఈమె టాపిక్ వల్ల హారిక, అఖిల్ మధ్య కూడా చిన్న గొడవ జరిగింది. అసలు ఈ మంగళవారం ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

నామినేషన్స్ విషయం గురించి నబిల్ మాట్లాడాడు. రోహిణి చెప్పింది కూడా ఓ కారణమేనా? అని నవ్వేశాడు. గౌతమ్, ప్రేరణలు మళ్లీ వాగ్వాదం పెట్టుకున్నారు. అవినాష్, తేజలు డిఫరెంట్ గెటప్‌లతో నబిల్‌తో ఫన్ చేశారు. ఇక అఖిల్, హారిక ఇంట్లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో టాస్కులు ఆడించేందుకు స్పీడ్, బ్యాలెన్స్‌లను ఎంచుకున్నారు. ఇక ఇంట్లోకి వచ్చిన అఖిల్, హారికలు కంటెస్టెంట్లను ఆట పట్టించారు. వారం రోజులు ఇక్కడే ఉంటామని చెప్పారు.

కంటెస్టెంట్లు రకరకాల టాస్కులో అఖిల్, హారికల్ని ఎంటర్టైన్ చేశారు. గౌతమ్, అవినాష్, రోహిణ, తేజ ఇలా టాస్కులు చేసి ఎంటర్టైన్ చేశారు. నబిల్ అయితే అసల్ ఇంట్రెస్ట్ లేనట్టుగా వ్యవహరించాడు. ఎవరినైనా సరే బంధించి ప్రేమించకూడదు అంటూ విష్ణుకి అఖిల్ సలహా ఇచ్చాడు. నేను ఎవ్వరినీ అలా చేయడం లేదు.. నేను నాలా ఉంటా.. నాకు నచ్చినట్టుగా ఉంటా.. అది నచ్చితే ఆడియెన్స్ నన్ను ఉంచుతారు.. నేను నచ్చడం, నచ్చకపోవడం అది వాళ్ల ఇష్టం.. అని చెప్పింది. ప్రేక్షకుల ఖర్మ.. వేస్తే వేస్తారు.. లేదంటే లేదు.. నేను మాత్రం మారను అని విష్ణు ఖరాఖండీగా చెప్పేసింది. ఇలాంటి విష్ణుకి జనాలు ఎలా ఓట్లు వేస్తున్నారు? ఆమె ఎలా సేఫ్ అవుతోందో? ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు.

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 86 రివ్యూ: విష్ణుని ఇప్పటికైనా సాగనంపుతారా?.. కంట్రోల్ తప్పిన నబిల్, పృథ్వీ

ఇక రోహిణి, గౌతమ్‌లని అఖిల్, హారిక సెలెక్ట్ చేస్తారు. ఇంకో ఇద్దరినీ సెలెక్ట్ చేసుకోమని రోహిణి, గౌతమ్‌లకు బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తాడు. దీంతో విష్ణు, తేజల్ని తీసుకున్నారు. లిమిట్ లెస్ అనే బ్రిడ్జ్ కట్టే ఈ టాస్కులో రోహిణి అదరగొట్టేసింది. విష్ణు మూడో స్థానంలోకి వచ్చింది. తేజ పూర్తిగా ఓడిపోయాడు. ఆ తరువాత తులాభారం టాస్కులో మళ్లీ రోహిణి దుమ్ములేపింది. అలా టికెట్ టు ఫినాలే రేసులో.. మొదటి కంటెండర్‌గా రోహిణి బ్యాడ్జ్ సంపాదించుకుంది. బ్లాక్ బ్యాడ్జ్‌ని విష్ణుకి ఇచ్చారు అఖిల్, హారిక. ఆమెకు ఆట మీదే ఇంట్రెస్ట్ లేదు.. ఏమైనా అంటే యూనివర్స్ అని అంటుంది.. తేజ అయితే కనీసం గెలవాలని ప్రయత్నిస్తాడు.. ఆడేందుకు ట్రై చేస్తాడు.. అని చర్చించుకుని విష్ణుని  రేసు నుంచి తప్పించారు. దీంతో విష్ణు కన్నీరు పెట్టేసుకుంది. నేను నవ్వుతూ ఉంటా.. సీరియెస్‌గా తీసుకోని అనుకుంటారేమో అని విష్ణు కన్నీరు పెట్టేసుకుంది. ఇక విష్ణుని పృథ్వీ ఓదార్చే ప్రయత్నం చేశాడు.

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 85 రివ్యూ: అంత చేసిన నిఖిల్‌ను కాపాడుకుందే.. కన్నడ బ్యాచ్ అని నిరూపించుకున్న యష్మీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Kollywood: తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Asifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Embed widget