అన్వేషించండి

Bigg Boss Telugu Season 8 : విష్ణుని ఇప్పటికైనా సాగనంపుతారా?.. కంట్రోల్ తప్పిన నబిల్, పృథ్వీ

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పదమూడో వారం నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. గౌతమ్, విష్ణు, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబిల్ నామినేట్ అయ్యారు.

13th Week Nomination List : బిగ్ బాస్ ఇంట్లో పదమూడో వారం నామినేషన్ ప్రక్రియ గరంగరంగా సాగింది. గత వారం జరిగిన టాస్కులు, అందులో చేసిన తప్పులు, వీకెండ్ టాస్కుల్లో ఇచ్చిన కంప్లైంట్స్ ఇలా అన్నీ కారణాల్ని కంటెస్టెంట్లు నామినేషన్ ప్రక్రియలో తీసుకొచ్చారు. అలా ఈ పదమూడో వారంలో గౌతమ్, విష్ణు, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబిల్ నామినేట్ అయ్యారు. ఈ సోమవారం ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం. 

ఫైనలిస్ట్‌గా చూడొద్దని అనుకునే ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేయాలి.. అని బిగ్ బాస్ చెప్పి నబిల్‌తో నామినేషన్ ప్రక్రియను ప్రారంభించేలా చేశాడు. నబిల్ వచ్చి గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఒక్కోలా ఉంటానని అన్నావ్.. ఎక్కడున్నా.. పక్షపాతం చూపిస్తావ్ ఎక్కడ చూపించా.. అసలు నువ్వు  నామినేషన్స్‌లో మాత్రమే ఫైర్ చూపిస్తావ్.. ఆటల్లో లేదు అని గౌతమ్‌ను అంటాడు. నువ్వు జెన్యూన్ అని అనుకున్నా.. కానీ నీది మిత్రదోహం అని నబిల్ గురించి గౌతమ్ చెబుతాడు. ఇక్కడికి నేను మెంటల్ అటాచ్మెంట్, బాండ్ గురించి రాలేదు.. అని నబిల్ అంటాడు.

విష్ణుకి ఆట పట్ల సీరియస్న్స్ కనిపించలేదు.. ఆట కనిపించడంలేదు.. అని నబిల్ అంటే.. సోలో గేమ్ విన్ అవ్వలేదు.. ఒప్పుకుంటా అని విష్ణు సమాధానం ఇస్తుంది.. ఒక మనిషి మీద పెట్టిన ఫోకస్ ఆటల్లో పెడితే విన్ అవుతావ్.. అని విష్ణుకి నబిల్ కౌంటర్ వేస్తాడు. ఆ తరువాత పృథ్వీ వచ్చి.. అవినాష్‌ను నామినేట్ చేస్తాడు.. ఎంటర్టైన్మెంట్ ఒక్కటే చేస్తున్నావ్, నువ్వెంటో చూపించడం లేదు.. నువ్వు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యావ్.. నబిల్ ఇచ్చిన షీల్డ్‌తో ఉన్నావ్.. నన్ను సేవ్ చేస్తూ వస్తున్నారు.. నువ్వు నీ పర్సనాలిటీని చూపించడం లేదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావ్ అని అవినాష్ గురించి పృథ్వీ చెబుతాడు.

ఆ తరువాత గౌతమ్‌ని నామినేట్ చేస్తూ.. పీకలేవు అని అన్నావ్ నాకు నచ్చలేదు.. కెమెరాలను చూసి మాట్లాడుతున్నావ్..  నాకు వాడు వీడు అనేది తప్పు అని తెలీదు.. ఆదిత్య అన్నని అన్నప్పుడు నాకు తెలిసింది.. అని పృథ్వీ చెబుతాడు. నీలో చాలా ఈగో ఉంది.. అని పృథ్వీని అంటే.. అందరిలో ఈగో ఉంటుందని కౌంటర్ వేశాడు. ఆ తరువాత ప్రేరణ వచ్చి.. విష్ణుని నామినేట్ చేస్తుంది.. ఇక్కడకు రావడం పెద్ద అవకాశం, ఇక్కడ ఉండాలనే స్పిరిట్ నీలో లేదు అని చెప్పింది. నా లోపాల్ని నేను సరిదిద్దుకోవడానికి.. 9 సార్లు సేఫ్ అయ్యా.. నాకు ఓట్లు వేస్తున్నారు కాబట్టే ఇక్కడ ఉన్నా.. అని విష్ణు ఎక్స్ ట్రాలు చేసింది.

గౌతమ్‌ని నామినేట్ చేస్తూ..  నువ్వు విన్నర్ అవ్వొద్దని అనుకుంటున్నావ్.. నువ్వు గేమ్ ప్లాన్‌తోనే ఉంటున్నావ్.. లెక్కలేసుకుని ఉంటున్నావ్.. అని ప్రేరణ కారణాలు చెప్పింది. ఆ తరువాత తేజ వచ్చి నా ఆట చెడగొట్టావ్ నాకు నచ్చలేదు అని నామినేట్ చేశాడు. పృథ్వీ ట్రిగ్గర్ చేయడం నచ్చడం లేదు అని నామినేట్ చేశాడు. విష్ణు వచ్చి రివేంజ్ నామినేట్ చేసింది. తేజ, ప్రేరణల్ని నామినేట్ చేసింది. ఆ తరువాత గౌతమ్, నిఖిల్ నామినేషన్స్ టైంలో మధ్యలో తేజ దూరడంతో పెద్ద గొడవే జరిగింది. పృథ్వీ మళ్లీ మీద మీదకు వచ్చాడు. రోహిణి నామినేషన్ టైంలో నబిల్ పిచ్చి పిచ్చిగా చేశాడు. రోహిణి మాటల్ని వినకుండా కూడా కాస్త తిక్కలా ప్రవర్తించాడు. ఇసుకని కుండలో ఇష్టం వచ్చినట్టు వేస్తా.. అంటూ నబిల్ నానా రకాలుగా వాదించేశాడు. అలా మొత్తంగా ఈ నామినేషన్ ప్రాసెస్‌లో నబిల్, పృథ్వీ కంట్రోల్ తప్పారు. విష్ణుని ఈ వారం అయినా జనాలు బయటకు పంపిస్తారా?లేదా? అన్నది చూడాలి.

Also Read : RAPO22 కోసం వివేక్-మెర్విన్.. ఈ హిట్ కాంబో గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
Embed widget