Bigg Boss Telugu Season 8 : అంత చేసిన నిఖిల్‌ను కాపాడుకుందే.. కన్నడ బ్యాచ్ అని నిరూపించుకున్న యష్మీ
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం యష్మీ ఎలిమినేట్ అయిపోయింది. వెళుతూ వెళుతూ గౌతమ్‌ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి వెళ్లిపోయింది.
Yashmi Elimination And Journey Video: బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం ఎలిమినేషన్ జరిగింది. ఈ వారంలో యష్మీ ఎలిమినేటర్ అయిపోయింది. ఎలిమినేషన్ కంటే ముందు కొన్ని ఆటలు ఆడించాడు నాగార్జున. గెస్ ది డైలాగ్, కంప్లైంట్ బాక్స్ అంటూ టాస్కులు పెట్టాడు. ఇక చివరకు పృథ్వీ, యష్మీ డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ఓట్లు తక్కువ రావడంతో యష్మీ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అసలు సండే ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.
గెస్ ది డైలాగ్ అంటూ టాస్క్ పెట్టి ఇంటి సభ్యులతో ఆట ఆడించాడు నాగ్. ఈ టాస్కులో నిఖిల్, గౌతమ్ అంటూ రెండు టీంలుగా విడగొట్టారు. డైలాగ్స్ చెప్పడానికి ఓ వ్యక్తి, వాటిని గెస్ చేసేందుకు ఇంకో వ్యక్తి వస్తాడు. అలా ఈ ఆటలో చివరకు నిఖిల్ టీం విన్ అయినట్టుగా నాగ్ చెప్పేశాడు. ఆ టాస్కులో అవినాష్, రోహిణి, విష్ణు, నిఖిల్ డ్యాన్సులతో అదరగొట్టేశారు. ఆ తరువాత ప్రేరణ సేఫ్ అని నాగ్ తెలిపాడు.
కంప్లైంట్ బాక్స్ అంటూ... ఇంటి సభ్యులందరూ తమకు నచ్చని కంటెస్టెంట్ల గురించి ఫిర్యాదులు రాశారు. అందులోంచి టాప్ 2 కంప్లైంట్‌లను బిగ్ బాస్ టీం తీసుకుంది. వాటిని ఓ కార్డు మీద రాసి పెట్టింది. వాటిని సదరు కంటెస్టెంట్ చదివి.. ఆ కంప్లైంట్ రాసింది ఎవరో గుర్తించే టాస్క్ పెట్టాడు. ఇందులో నబిల్ మాత్రమే తన మీద కంప్లైంట్లు రాసిన కంటెస్టెంట్లను కరెక్ట్‌గా గుర్తించాడు. ఈ టాస్కులో అవినాష్ చేసే సౌండ్స్ గురించి యష్మీ కంప్లైంట్ చేసింది. రోహిణి పదే పదే చెప్పింది చెబుతుందని తేజ కంప్లైంట్ చేశాడు. ఈ టాస్క్ అనంతరం నబిల్ సేఫ్ అని చెప్పేశాడు.
ఆ తరువాత డిజైర్ కారుకి సంబంధించిన టాస్క్ పెట్టాడు. ఆపై యష్మీ ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకు వచ్చింది. ఫ్రెండ్స్ ఎవరు? ఎనిమీస్ ఎవరు? అని ఓ టాస్క్ పెట్టాడు నాగ్. దీంతో తన కన్నడ బ్యాచ్ అందరినీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో పెట్టింది. వారితో పాటు విష్ణుని కూడా ఫ్రెండ్ లిస్ట్‌లో పెట్టేసింది. ప్రేరణ ఫ్రెండ్ అని ఎట్టకేలకు ఒప్పేసుకుంది. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు అని ఆమెకు సలహా ఇచ్చింది. నిఖిల్‌లో ఫ్రెండ్ షిప్ గుణం ఉంటుంది.. ఏం జరిగినా మేం ఫ్రెండ్స్.. నీ మిస్టేక్స్ నువ్వు కరెక్ట్ చేసుకుంటే ఇంకా చాలా గ్రాఫ్ పెరుగుతుంది అని అతగాడికి సూచించింది. పృథ్వీ చాలా మంచి వ్యక్తి.. విష్ణు చాలా మంచి వ్యక్తి.. అని వారిని పొగిడేసింది.
శత్రువుల కేటగిరీలో గౌతమ్, అవినాష్, రోహిణిలను పెట్టింది. అందరితో ఇంటరాక్ట్ అవ్వు.. ఇండివిడ్యుయల్ గేమ్ అని అలా ఉండిపోకు.. అని గౌతమ్‌కు సలహా ఇచ్చింది. మీరు నా ఎనిమీ కాదు.. ఎప్పుడూ నవ్విస్తారు.. ఫన్ నచ్చుతుంది.. ఇండివిడ్యువాలిటినీ చూపించండి అంటూ అవినాష్, రోహిణిలకు సలహా ఇచ్చింది. బయటకు వెళ్లే టైంలో నిఖిల్ లేదా గౌతమ్ ఎవరో ఒకరిని నామినేట్ చేసి వెళ్లాలని నాగ్ అన్నాడు. వారిద్దరికీ శనివారం ఎపిసోడ్‌లో స్నేక్ అని ఎక్కువగా రావడంతో ఈ బిగ్ బాంబ్ వేయాల్సి వచ్చింది. నిఖిల్ ఈ వారం నామినేట్ అయి సేఫ్ అయ్యాడు కాబట్టి.. గౌతమ్‌ను నామినేట్ చేస్తున్నా అని యష్మీ చెప్పి వెళ్లిపోయింది. పోయే టైంలోనూ నిఖిల్‌ను కాపాడుకుని వెళ్లిపోయింది యష్మీ. అంత గొడవ పెట్టుకున్నారు.. అంత అనుకున్నారు.. అయినా కన్నడ బ్యాచ్ మీద ప్రేమను మాత్రం యష్మీ చూపించకుండా ఉండలేకపోయింది.