అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bigg Boss Telugu Season 8 : ‘బొచ్చు’లో టాపిక్! విష్ణు ‘క్యారెక్టర్’, రోహిణి ‘ప్లాన్’..అందరికీ క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం ముగింపు సమయంలో శనివారం ఎపిసోడ్ లో నాగ్ కంటెస్టెంట్లకు తన స్టైల్లో తలంటు పోశాడు. పృథ్వీ, గౌతమ్ గొడవ.. రోహిణి, విష్ణుగొడవల పై వాయించేసాడు.

Nagarjuna Fires on Prithvi Gautam Rohini And Vishnupriya: 

బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం ముగిసేందుకు వచ్చింది. ఈ వారంలో చాలానే హాట్ టాపిక్స్ జరిగాయి. పృథ్వీ, గౌతమ్ గొడవ.. రోహిణి, విష్ణు నోరు పారేసుకోవడం ఇలా చాలానే విషయాలు జరిగాయి. వీటిపై నాగ్ కూడా సీరియస్ అయ్యాడు. దీంతో కంటెస్టెంట్లకు తన స్టైల్లో తలంటు పోశాడు నాగ్. ఇక ఈ వారంలో యష్మీ ఎలిమినేట్ అయినట్టుగా లీక్స్ వస్తున్నాయి. ఆ విషయం తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. అసలు ఈ శనివారం ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.

పృథ్వీ ఆటల్లో బాగా చించేశాడు అని కాళ్లని నిఖిల్, విష్ణు మసాజ్ చేశారు. ఇక యష్మీ సంచాలక్‌గా ఫెయిల్ అన్నట్టుగా నిఖిల్, విష్ణులు చెప్పుకొచ్చారు. తెల్లారే సరికి నిఖిల్ కాస్త డల్ మూడ్‌లో ఉంటే గౌతమ్ వచ్చి మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు. బయటకు వెళ్లి నీ రిలేషన్‌ను సెట్ చేసుకునే ఛాన్స్ ఉంది.. ఈ మూడు వారాలు ఇక్కడ బాగా ఆడు..  ఫోకస్డ్‌గా ఆడు..  రాసి పెట్టి ఉంటే దక్కుద్దని అంటావ్ కదా.. అని కాస్త పాజిటివ్‌గా మాట్లాడాడు గౌతమ్.

యష్మీ, నిఖిల్‌లు ఫుల్ చిల్ అవుతుండటం చూసి తేజ షాక్ అయ్యాడు. మొన్నే అంత తిట్టుకున్నారు.. మళ్లీ ఇప్పుడు ఇలా ఉన్నారు.. అసలేం జరుగుతోంది.. చూసే మనం పిచ్చోళ్లమా? అని రోహిణితో తేజ అన్నాడు. ఆ తరువాత స్టేజ్ మీద నుంచి నాగ్ అందరినీ పలకరించాడు. మెగా చీఫ్ అయిన రోహిణిని అభినందించాడు. 

ఈ పదేళ్లలో ఎంత సాధించినా రాని సంతోషం వచ్చింది.. జీరో, ఫైర్ లేదు.. ఎంటర్టైనర్‌వి మాత్రమే.. అని ఇలా అన్నారు.. వాళ్లందరికీ చూపించావ్ కదా అని నాగ్ అనడంతో రోహిణి మరింత సంబరపడిపోయింది.. ఫెంటాస్టిక్‌గా ఆడావ్.. ఆ  కసి ఉంటేనే గెలుస్తాం.. ఆ గెలుపు ఎంతో తీపిగా ఉంటుంది.. అని రోహిణి గెలుపు గురించి నాగ్ మాట్లాడాడు.

ఆ తరువాత విష్ణు, రోహిణి మ్యాటర్‌ను నాగ్ సెట్ చేశాడు. నువ్వు కారెక్టర్ అని అనడం తప్పు అని విష్ణుని, ప్లాన్ అని వాడటం నీది తప్పు అని రోహిణిని మందలించాడు నాగ్. ఆవేశం, కోపంలో ఉన్నప్పుడే ఆలోచనలు కోల్పోతాం.. అప్పుడే మనం ఏం మాట్లాడుతున్నామనేది కంట్రోల్‌లో పెట్టుకోవాలంటూ నాగ్ చెప్పాడు. ఈ విషయం మీద ఇంటి సభ్యుల నిర్ణయాన్ని అడిగితే.. ప్రేరణ, గౌతమ్, అవినాష్ ఇలా అందరూ విష్ణు, రోహిణిల ఇద్దరిదీ తప్పే అని అంటారు.

ఆ తరువాత పృథ్వీ, గౌతమ్ టాపిక్‌ను  చర్చించాడు. బొచ్చు కూడా పీకవు.. ఏం పీకుతావు అని మాట్లాడటం ఏంటి? వేరే వాళ్లు మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఎందుకు దూరుతావ్.. వాళ్లు గ్రూపు గేమ్ ఆడితే నీకేంటి? ఆడియెన్స్ చూస్తారు.. ట్రోఫీని సింగిల్‌ వ్యక్తి లిఫ్ట్ చేస్తాడు.. ఎంతకాలం ఆడతారో ఆడనివ్వు.. నీకు ఏంటి? అని గౌతమ్‌ మీద ఫైర్ అవుతాడు. నాగ్ మాట్లాడుతూ ఉంటే.. మధ్యలో గౌతమ్ డిస్టర్బ్ చేస్తుంటాడు. దీంతో నాగ్ మరింత సీరియస్ అవుతాడు. నేను నీ కంటెస్టెంట్‌ను కాదు.. నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకు షట్ అప్ అంటూ గౌతమ్ మీద సీరియస్ అయ్యాడు.

పృథ్వీని కూడా నాగ్ వాయించేశాడు. అసలు నువ్వు ఎందుకు అలా మీద మీదకు వెళ్తావ్.. నిలబడి మాట్లాడలేవా? అలా మీద మీదకు వెళ్లి ఏం ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నావ్.. కొడతావా?.. అసలు వాడు వీడు అని ఎందుకు మాట్లాడుతావ్ అంటూ పృథ్వీని కడిగి పారేశాడు నాగ్. అలా గౌతమ్, పృథ్వీలకు నాగార్జున తలంటు పోశాడు. ఆ తరువాత ఇంటి సభ్యులకు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ పెట్టాడు. రోహిణికి అవినాష్ ల్యాడర్, పృథ్వీ స్నేక్ అని చెప్పింది. అవినాష్‌కి తేజ రోహిణి ల్యాడర్, పృథ్వీ స్నేక్ అని చెప్పాడు.

నబిల్ తనకు పృథ్వీ ల్యాడర్ అని, నిఖిల్ స్నేక్ అని చెప్పాడు. పృథ్వీ తనకు ల్యాడర్ నబిల్ అని, స్నేక్ గౌతమ్ అని అన్నాడు. గౌతమ్ తనకు రోహిణి ల్యాడర్, నిఖిల్ స్నేక్ అని అన్నాడు. నిఖిల్ తనకు పృథ్వీ ల్యాడర్ అని, గౌతమ్ స్నేక్ అని అన్నాడు. యష్మీ తనకు ప్రేరణ ల్యాడర్ అని, నిఖిల్ స్నేక్ అని చెప్పింది. తేజ తనకి అవినాష్ ల్యాడర్ అని, విష్ణు స్నేక్ అని చెప్పాడు. విష్ణు తనకి నబిల్ ల్యాడర్ అని, రోహిణి స్నేక్ అని చెప్పింది. ప్రేరణ తనకి ల్యాడర్ రోహిణి అని, గౌతమ్ స్నేక్ అని చెప్పింది. చివరకు నిఖిల్ సేఫ్ అయినట్టుగా శనివారం ఎపిసోడ్‌లో నాగ్ చెప్పేశాడు.

Also Read: KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget