KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Kiran Abbavaram's KA OTT Platform: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'క' మూవీ ఓటిటి ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
చిన్న సినిమాగా రిలీజై, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'క' (KA Movie OTT). తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఏ ఓటీటీలో, ఎప్పుడు "క" మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది అన్న విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "క". సుజిత్, సందీప్ దర్శక ద్వయం తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణారెడ్డి, చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 50 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ప్రముఖ
నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్‌లో 'క' స్ట్రీమింగ్
తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో నవంబర్ 28 నుంచి 'క' మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది అన్న విషయాన్ని తాజాగా చిత్ర బృందం అనౌన్స్ చేసింది. 'క' మూవీ ఓటీటీలో కేవలం తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. ఎందుకంటే ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అన్నీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. కాబట్టి ఈ మూవీ డబ్బింగ్ వర్షన్లు ఇతర భాషలలొ థియేట్రికల్ గా రిలీజ్ అయ్యేదాకా ఓటీటీలోకి రాకపోవచ్చు అని టాక్ నడుస్తోంది.
ఆడుదాము #KA చ్చితంగా,
— ETV Win (@etvwin) November 23, 2024
ఈసారి అదిరిపోయే సప్పుడు తో అద్భుతమైన పిక్చర్ తో...🔈🔉🔊
Experience #KA with Dolby Vision Atmos 🤩
From Nov 28 Only on @EtvWin
A @SamCSmusic musical 🎶@Kiran_Abbavaram @UrsNayan @tanviram_ @DirSujith @sandeep_deep02 @srichakraas #KiranAbbavaram #EtvWin pic.twitter.com/VbwOIFS9e4
"క" మూవీ కథ ఏంటంటే... అభినయ వాసుదేవ్ అనే వ్యక్తి ఒక అనాథ. ఎప్పటికైనా తల్లిదండ్రులు తిరిగి వస్తారు అన్న ఆశతో బ్రతుకుతాడు. అలాగే అతనికి ఇతరుల ఉత్తరాలు చదువుతూ, వాటిని తన సొంత వాళ్లే రాసారని ఊహించుకునే వింత అలవాటు కూడా ఉంటుంది. ఇలా రోజూ సంతోషంగా ఉండాలనే కోరికతో పోస్ట్ మాన్ కావాలని డిసైడ్ అవుతాడు. అయితే ఈ అలవాటు వల్ల శరణాలయంకు సంబంధించిన వార్డెన్ ఉత్తరాన్ని చదువుతూ దొరికిపోతాడు. దీంతో అతను వాసుదేవ్ ని కొట్టి, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. ఆ తర్వాత రోజు వార్డెన్ దగ్గర ఉన్న డబ్బులు దొంగతనం చేసి శరణాలయం నుంచి పారిపోతాడు. అయితే నిజానికి ఆ వార్డెన్ తన కూతురు ఆపరేషన్ కోసం ఆ డబ్బు దాచుకుంటాడు. కానీ వాసుదేవ్ దాన్ని తీసుకుని పారిపోవడం వల్ల సమయానికి ఆపరేషన్ జరగక, వార్డెన్ కూతురు చనిపోతుంది. అయితే ఈ విషయాలు ఏమీ తెలియని వాసుదేవ్ మాత్రం దొంగిలించిన డబ్బుతో వేరే ఊరికి వెళ్లి, టెన్త్ వరకు చదివి ఉద్యోగం సంపాదిస్తాడు. కృష్ణగిరి అనే ఊర్లో అసిస్టెంట్ పోస్ట్ మాన్ గా ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ వాసుదేవ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాసుదేవ్ ఎందుకు జైలుకు వెళ్తాడు? వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను తెరపై చూడాల్సిందే.