Mechanic Rocky OTT Platform : 'మెకానిక్ రాకీ' మూవీకి ఓటిటి పార్టనర్ ఫిక్స్... డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mechanic Rocky OTT Release : విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ' ఓటిటి పార్టనర్ ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mechanic Rocky OTT : యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం "మెకానిక్ రాకీ" ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అంతలోనే ఈ మూవీ ఏ ఓటిటిలో అందుబాటులో ఉండబోతోంది ? "మెకానిక్ రాకీ" డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు ? అనే విషయాలపై చర్చ నడుస్తోంది. విశ్వక్ సేన్ ఈ ఏడాది వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2024 ప్రథమార్థంలో విశ్వక్ సేన్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో థియేటర్లలోకి వచ్చారు. అందులో 'గామి' మూవీ హిట్ టాక్ తెచ్చుకోగా, 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఇదే ఏడాది ముచ్చటగా మూడవసారి 'మెకానిక్ రాకీ' అంటూ, మరో కొత్త చిత్రంతో థియేటర్లలోకి వచ్చారు.
విశ్వక్ సేన్ హీరోగా, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన "మెకానిక్ రాకీ" సినిమాకు రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించారు. రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మించగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. సునీల్, హైపర్ ఆది, నరేష్ తదితరులు కీలకపాత్రలను పోషించిన ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి హైప్ పెంచారు చిత్రబృందం. ఇప్పుడు సినిమాకు థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది మూవీ బాగుందని కామెంట్స్ చేస్తుంటే, మరికొంత మంది మాత్రం డిసప్పాయింట్ చేసిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఏ ఓటిటిలో రిలీజ్ కాబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. 'మెకానిక్ రాకీ' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. కాబట్టి ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఇప్పుడు చాలా వరకు సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణను బట్టి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మంచి రెస్పాన్స్ వస్తే థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాత సినిమాలు ఓటిటిలో అడుగు పెడుతున్నాయి. మరికొన్ని సినిమాలు అంతకంటే ముందే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. మరి "మెకానిక్ రాకీ" మూవీ ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయంపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అయితే ఈ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
'మెకానిక్ రాకీ' మూవీ ప్రమోషన్స్ టైమ్ లో విశ్వక్ సేన్ చేసిన పలు కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రమోషన్స్ లో మంచి ప్రశ్న అడిగిన వాళ్ళకు గోల్డ్ కాయిన్, శ్రద్ధా శ్రీనాథ్ గతంలో తనతో నటించడానికి ఒప్పుకోలేదు అని విశ్వక్ చేసిన కామెంట్స్, అలాగే రివ్యూవర్లపై ఫైర్ అయిన తీరు చర్చకు దారి తీసింది. దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కానీ థియేటర్లలో మాత్రం 'మెకానిక్ రాకీ' మూవీకి ఊహించనంత రెస్పాన్స్ రావట్లేదు. మరి ఈ మూవీ పోటీగా రిలీజ్ అయిన సత్య దేవ్ 'జీబ్రా', అశోక్ గల్లా 'దేవకీ నందన వాసుదేవ' వంటి సినిమాలను తట్టుకుని ఎంతవరకు థియేటర్లలో నిలదొక్కుకుంటుందో చూడాలి.
Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే