Kannada Vs Telugu - Bigg Boss 8: 'బిగ్ బాస్'లో తెలుగు vs కన్నడ బ్యాచ్ రగడ... గొడవకు కారణం స్టార్ మా, బిగ్ బాసే కారణం కాదా?
Bigg Boss 8 Telugu: గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ 8 నిర్వాహకులపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కన్నడ వర్సెస్ తెలుగు గొడవను సపోర్ట్ చేస్తున్నారని తెలుగు ప్రజలు మండిపడుతున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss 8 Telugu) చివరకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో ఈ సీజన్ కు ఎండ్ కార్డు పడబోతోంది. అయితే ఎన్నడూ లేని ఒక చెడు సంప్రదాయం ఈ సీజన్ నుండే మొదలైంది. తెలుగు వర్సెస్ కన్నడ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గొడవలు అందుకు ఉదాహరణ. 'బిగ్ బాస్'లో కన్నడ వాళ్లంతా కలిపి తెలుగువాళ్లను తొక్కేస్తున్నారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు. నిఖిల్, పృథ్వి, యశ్మీ (మొన్నటి వరకూ ), ప్రేరణ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనీ తెలుగు ప్లేయర్లు గౌతమ్, రోహిణి, అవినాష్, తేజ లాంటి వాళ్ళను ఎలాగైనా హౌస్ నుంచి బయటికి పంపించేందుకు ప్లాన్ చేసి ఆడుతున్నారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల సారాంశం. దానికి బిగ్ బాస్ టీమ్ కూడా డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ.
గతంలో ఎన్నడూ లేని విమర్శలు ఇప్పుడే ఎందుకు?
తెలుగు బిగ్ బాస్ ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. అదిగాక ఓటిటి సీజన్ కూడా ఒకటి జరిగింది. కానీ ఎప్పుడూ ఇలా భాషా పరమైన వివక్ష గాని విమర్శలు గాని ఈ షో మీద వినపడలేదు. సీజన్ 1 నుంచి చూసుకుంటే అమిత్, బాబా భాస్కర్, మోనాల్,దీక్షా పంత్,పూజ రామచంద్రన్ లాంటి వాళ్ళు తెలుగు భాషకు చెందిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఎవ్వరి మీద అలాంటి ఆరోపణ రాలేదు. పైపెచ్చు బాబా భాస్కర్ లాంటి హౌస్ మేట్స్ ను ఇప్పటికీ తమ ఫేవరెట్ హౌస్ మేట్లుగా భావించేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఈ సీజన్ 8 లో మాత్రం కన్నడ భాషకు చెందిన నటులు ఒక గ్రూపుగా ఏర్పడి మిగిలిన వారికి వ్యతిరేకంగా మాట్లాడటం, తమలో తాము డిస్కస్ చేసుకుని మరీ నామినేషన్ చేయడం, ఒకరిని ఎవరన్నా ఏదైనా అంటే అందరూ కలిసి మాటలతో ఎదురుదాడికి దిగడం వంటివి ఈ కన్నడ వర్సెస్ తెలుగు వివాదానికి కారణమయ్యాయి. గత సీజన్లో శివ బాలాజీ-హరి తేజ, సోహైల్ - మెహబూబ్ - అఖిల్, అభిజిత్ - హారిక, శివాజీ - ప్రశాంత్ - యావర్ లాంటి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నా గ్రూప్ గేమ్ అనే పేరు రాలేదు. కారణం ఎవరి ఆట వాళ్ళు పోటీపడి ఆడేవాళ్ళు. గత సీజన్లో అమర్ - ప్రియాంక - శోభా శెట్టిలపై ఇలాంటి విమర్శ వచ్చినా అది భాషా పరమైనదైతే కాదు. ఈసారి కన్నడకు చెందిన హౌస్ మేట్స్ ఒక గ్రూప్ గా ఏర్పడి ప్లాన్ చేసుకుని మరీ ఆడుతున్నారనేది మీ సీజన్ మీద వస్తున్న ప్రధాన విమర్శ.
Also Read: చేజేతులా గేమ్ పాడుచేసుకున్న నబీల్... ఇలా ఆడితే బిగ్ బాస్ టైటిల్ నెగ్గడం కష్టమేనా?
బిగ్ బాస్ టీం చేసిన నిర్వాకమే దీనికి కారణం
బిగ్ బాస్ గత సీజన్ల లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. ముఖ్యంగా నామినేషన్ల విషయంలో ఎవరన్నా డిస్కస్ చేసుకున్నా, ఒక నామినేషన్ చేస్తున్న సమయంలో మరొకరు ఎంటర్ అయినా వెంటనే బిగ్ బాస్ నుండి సీరియస్ వార్నింగ్ వచ్చేది. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ టీం ఈ విషయాన్ని చాలా ఫ్రీగా వదిలేసింది. దాంతో కన్నడ బ్యాచ్ గా పేరొందిన నిఖిల్, పృథ్వీ, యశ్మీ లాంటి వాళ్ళు నెక్స్ట్ వీక్ ఎవరిని నామినేట్ చేస్తున్నారనేది ముందుగానే డిస్కస్ చేసుకుంటున్నారు. పైపెచ్చు గతవారం హోస్ట్ హోదాలో ఉన్న నాగార్జున తో గ్రూవ్ గేమ్ ఆడితే తప్పేంటి అంటూ బిగ్ బాస్ టీం చెప్పించడం సోషల్ మీడియాలో నెగిటివ్ అయింది. ఇక ఒంటరిగా ఆడుతున్న గౌతమ్ ను పృథ్వి ప్రేరణ, యశ్మీ లాంటి వాళ్ళు టార్గెట్ చేయడం రోహిణి, అవినాష్ లను మీరు జీరోలంటూ నామినేషన్ లలో పెట్టడం కూడా సోషల్ మీడియాలో కన్నడ vs తెలుగు ఫైట్ కి కారణమైంది. బిగ్ బాస్ అనేది చాలామంది అభిమానులు ఉన్న రియాల్టీ షో. దీనిని సీరియస్గా తీసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో యూత్ ఎక్కువమంది. అంతమందిపై ప్రభావం చూపించే రియాల్టీ షో నిర్వహణ లో టీమ్ అలసత్వం వహించడం వల్లే ఇలాంటి అవాంఛనీయ సోషల్ మీడియా ఫైట్లు మొదలవుతున్నాయన్న వాదన బలపడుతోంది. మరి నెక్స్ట్ సీజన్ల నుంచి అయినా బిగ్ బాస్ టీం ఇలాంటి భాషా పరమైన ఫైట్లుకు ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతుందేమో చూడాలి.
Also Read: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ