'కృష్ణ ముకుంద మురారి' సీరియల్‌లో కృష్ణ పాత్రలో నటించి మెప్పించిన ప్రేరణ కంబం 'బిగ్ బాస్ 8'లో అడుగు పెట్టారు. ఆవిడ ఎవరో తెలియని వారు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
'బిగ్ బాస్ 8'లోకి ప్రేరణ వెళ్ళాకా... ఆమె గురించి సెర్చ్ చేసిన నెటిజనులు పెళ్లి అయ్యిందని తెలుసుకుని షాక్ అయ్యారు.
అవును... ప్రేరణకు తొమ్మిది నెలల క్రితం పెళ్లి అయ్యింది. అందుకు సాక్ష్యం ఇదిగో... పెళ్లి సమయంలో తీసిన ఫోటో!
ప్రేరణ తమిళ కుటుంబంలో జన్మించిన అమ్మాయి. తమిళ సాంప్రదాయ పద్ధతుల్లో ఆవిడ పెళ్లి చేసుకున్నారు.
ప్రేరణ భర్త పేరు శ్రీపాద దేశ్‌పాండే. తామిద్దరం మంచి స్నేహితుల్లా ఉంటామని పలు సందర్భాల్లో ప్రేరణ చెప్పారు.
భర్త శ్రీపాదతో కలిసి ప్రేరణ పలు ఫోటో షూట్స్ చేశారు. యాక్ట్రెస్ కదా... అందుకని ఆవిడ చేసే ఫోటో షూట్స్ అన్నీ క్రియేటివ్ గా ఉంటాయి.
భర్త శ్రీపాదతో కలిసి ప్రేరణ కొన్ని ఫారిన్ టూర్లు వేశారు. అక్కడ కూడా వీడియోలు క్రియేటివ్ గా చేశారు.
కొత్తగా పెళ్లి అయినా సరే 'బిగ్ బాస్ 8' కోసం భర్త నుంచి వంద రోజులు దూరంగా 'బిగ్ బాస్' హౌస్ లో ఉండటానికి ప్రేరణ వచ్చారు.
'బిగ్ బాస్ 8'లోకి రావడానికి ముందు స్టార్ మాలో టెలికాస్ట్ అయిన 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్' షోలో పార్టిసిపేట్ చేశారు.