బిగ్ బాస్ 8 భామ, హీరోయిన్ సోనియా... ఏ ఊరు, ఏం చదువుకుందో తెలుసా?

Published by: Satya Pulagam

సోనియా ఆకులది తెలంగాణలోని ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో గల మంతని.

వ్యవసాయ కుటుంబంలో సోనియా ఆకుల జన్మించింది. ఆమె తల్లి గృహిణి. ఒకప్పుడు చీరలు అమ్మేవారు. తండ్రి ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు. 

సోనియాకు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ముల ముద్దుల చెల్లెలు ఆవిడ. 

సోనియా ఆకుల బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. అలాగే, ఎల్‌ఎల్‌బి కూడా చేశారు.

రామ్ గోపాల్ వర్మ తీసిన 'ఆశా ఎన్కౌంటర్' (దిశా ఎన్కౌంటర్ బేస్డ్ సినిమా)లో సోనియా హీరోయిన్. 

'ఆశా ఎన్కౌంటర్'కు ముందు 'కరోనా వైరస్' అని వర్మ క్యాంపు నుంచి వచ్చిన మరొక సినిమాలోనూ సోనియా ఆకుల నటించింది. 

సోనియా ఆకుల మొదటి సినిమా 'జార్జ్ రెడ్డి'. అందులో హీరో సిస్టర్ రోల్ ఆవిడ చేసింది. 

సోనియా ఓ స్వచ్ఛంద సంస్థ నెలకొల్పింది. 'యాక్షనీర్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్' స్థాపించింది. 'విరాట్ ఫౌండేషన్'కు ఆమె కో ఫౌండర్ కూడా!

'బిగ్ బాస్ 8'లో సోనియా ఆకుల ఏం చేస్తారో చూడాలి. (All Images Courtesy: soniya_akula_official / Instagram)