Bigg Boss 8: చేజేతులా గేమ్ పాడుచేసుకున్న నబీల్... ఇలా ఆడితే బిగ్ బాస్ టైటిల్ నెగ్గడం కష్టమేనా?
Nabeel Afridi In Bigg Boss 8 Telugu: వరంగల్ కుర్రాడు, యూట్యూబర్ నబీల్ అఫ్రీదీ చేజేతులా తన గేమ్ పాడుచేసుకున్నాడా? ఇలా ఆడితే ఇకపై అతను బిగ్ బాస్ 8లో టైటిల్ విజేతగా నిలవడం కష్టమేనా?
బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss Season 8 Telugu) మొదట్లో విన్నర్ అయ్యే కంటెస్టెంట్‌గా కనిపించింది నబీల్ అఫ్రీదీ (Nabeel Afridi) ఒక్కడే. టాస్కుల్లో పవర్ ఫుల్ గా ఆడుతూ విన్నింగ్ రేస్ లో నిలబడ్డాడు ఈ వరంగల్ పోరగాడు. సోషల్ మీడియాలో తనకు పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా లభించింది. ఆ తరువాత నిఖిల్, ప్రేరణ కూడా చాలా బాగా ఆడుతూ టాప్ లో నిలిచారు. వైల్డ్ కార్డుగా వచ్చిన గౌతమ్ ప్రస్తుతం సూపర్ గేమ్ ప్లాన్ తో ముందుకు వెళుతున్నాడు. అయితే మొదటి నుంచీ టైటిల్ రేసులో ఉన్నట్టు కనిపించిన నబీల్ మాత్రం ప్రస్తుతం తన ఆటను చేజేతులా పాడు చేసుకుంటూ నెంబర్ వన్ పొజిషన్ నుంచి క్రిందకు జారిపోతున్నాడు. ఈ వారం అయితే ఒకదాని వెంట ఒకటి తప్పుడు నిర్ణయాలతో తన గ్రాఫును తానే పాడు చేసేసుకున్నాడు నబీల్
సోషల్ మీడియా నుండి బిగ్ బాస్ వరకూ చేరుకున్న నబీల్ ఆఫ్రిది
వరంగల్ కు చెందిన కు చెందిన అఫ్రీది యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. ఫ్రాంక్ వీడియోలతో పాపులర్ కావడంతో అతనికి బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అయితే చక్కగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 8 మొదట్లో ఒక్కసారిగా టాస్కుల్లో పోటీపడి ఆడడంతో పాటు నామినేషన్స్ లో ఫైర్ చూపించడంతో నవీన్ కి మొదట్లో విపరీతమైన పేరు వచ్చింది. టాప్ 5లో ఉండడంతో పాటు టైటిల్ రేసు కూడా తనదే అనే స్థాయిలో పాపులర్ అయిపోయాడు. కానీ ఆట మధ్యలో సడన్ గా డల్ అయిపోవడంతో పాటు నిఖిల్, ప్రేరణ, గౌతమ్ లు ఆటలో ఫైర్ చూపించడంతో టైటిల్ రేస్ లో వెనుక బడ్డాడు నబీల్.
ఫ్యామిలీ వీక్ నుంచి నబీల్ గేమ్ విషయంలో తేడా కొట్టింది
బిగ్ బాస్ సీజన్ కు అతి ముఖ్యమైనది ఫ్యామిలీ వీక్. ఫ్యామిలీ మెంబర్లతో పాటు సెలబ్రిటీ ఫ్రెండ్ వచ్చి కంటెస్టెంట్ల ఆట ఎలా ఉండనే దానిపై ఫీడ్ బ్యాక్ ఇస్తుంటారు. వాళ్ళు ఇచ్చే హింట్స్ గెస్ చేసి దాని ప్రకారమే ఆటలో మార్పులు చేర్పులు చేసుకుంటారు ఇంటి సభ్యులు. అయితే నబీల్ ఆట దెబ్బతిన్నది ఇక్కడ నుండే. తనకు సపోర్ట్ గా వచ్చిన తన సోదరుడు, భోలే శావలి నుండి సరైన ఇన్‌పుట్స్ నవీన్ అఫ్రీదీకి దొరకలేదు. స్టేజ్ పై ఎక్కువగా మాట్లాడే అవకాశం నబీల్ సోదరుడికి దక్కలేదు. సెలబ్రిటీ ఫ్రెండ్ గా వచ్చిన భోలే, నబీల్ ఆటను రివ్యూ చేసే బదులు తనను తాను పొగుడుకుని వెళ్ళిపోయాడు. అంతకుముందు నబీల్ తల్లి హౌస్ లోకి వెళ్లినా ఆటపరంగా నబీల్ కు సరైన సలహాలు ఇవ్వలేకపోయారు. తర్వాత నబీల్ ను నామినేట్ చేసిన నైనిక అతని ఆటలో ఫైర్ కనిపించట్లేదు అనడంతో ఆ ఫైర్ చూపించే ఉద్దేశంతో రాంగ్ ట్రాక్ లో పడిపోయాడు.
Also Read: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
శివంగి రోహిణీని టార్గెట్ చేయడం కూడా మైనస్ అవుతోందా?
అవసరం లేకపోయినా గౌతమ్, ప్రస్తుతం శివంగిలా ఆడుతున్న రోహిణీని టార్గెట్ చేస్తూ కనీసం వాళ్ళు చెప్పేది వినకుండా విచిత్రమైన అరుపులు, కూతలతో చూసి ఆడియన్స్ కు సైతం చిరాకు తెప్పించాడు నబీల్ అఫ్రీదీ. ఇక రాత్రి జరిగిన టికెట్ టు ఫినాలే కంటెండర్ షిప్ పోటీలో తనకంటే ముందు సుడోకు గేమ్ పూర్తిచేసిన అవినాష్ ను 'నీకు వేరే వాళ్ళు హెల్ప్ చేశారా?' అంటూ అడగడం అతని ఆటను దిగజార్చింది. ఇప్పటికీ OG వర్సెస్ రాయల్స్ అనే భ్రమలోనే ఉంటూ ఎవరైతే తనపై స్కెచ్ లు వేస్తున్నారో వాళ్ళకే దగ్గరగా ఉంటూ ఆట పరంగా పూర్తిగా రాంగ్ ట్రాక్ లోకి వెళ్లిపోయాడు నబీల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'ఆటలో జీరోలు, మీలో ఫైర్ లేదు' అంటూ చిన్న చూపు ఎదుర్కొన్న టేస్టీ తేజ, అవినాష్, రోహిణిలు తమ సత్తా చూపుతూ రెండు వారాల నుంచి ట్రెండింగ్ లోకి వస్తే సీజన్ మొదట్లో టైటిల్ తనకే అనే స్థాయిలో ప్రభావం చూపిన నబీల్ తన గ్రాఫ్ ను ప్రస్తుతం చెజేతులా దిగజార్చుకోవడం అతని అభిమానుల్ని సైతం నిరాశ కు గురిచేస్తోంది. దానికి తోడు తనకు నచ్చని వారిపై నబీల్ చేసే బ్యాక్ బిచ్చింగ్ తనకు చాలా చెడ్డ పేరు తెచ్చి పెడుతోంది. మిగిలిన రెండు వారాల్లో నైనా తన పూర్వపు ఆటను నబీల్ అందుకుంటాడో లేదో చూడాలి.