అన్వేషించండి

Revanth Reddy in Assembly: లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !

Telangana: కులగణన సర్వే ను రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. 96.9 శాతం ప్రజలు తమ వివరాలు ఇచ్చారన్నారు.

Revanth Reddy Speech on Caste Census Survey: తెలంగాణ కులగణన సర్వే సమగ్రంగా జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికను  సీఎం రేవంత్ రెడ్డి  అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజా ప్రతినిధిగా కులగణన సర్వే వివరాలను నివేదిక రూపంలో సభలో ప్రకటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇదొక చారిత్రాత్మకమైన సందర్భమని  రాష్ట్రంలో 66 లక్షల 99 వేల 602 కుటుంబాల సమాచారాన్ని సర్వే ద్వారా సేకరించామని ప్రకటించారు. 

మొత్తం తెలంగాణలో 96.9 శాతం సర్వే... డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజులు పట్టిందన్నారు.  యావత్ దేశం తమ వైపు చూసేలా సర్వేను నిర్వహించామన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, బీసీలు 46.25 శాతం, ముస్లిం మైనారిటీల్లో బీసీలు 10.08 శాతం, ముస్లింలతో సహా మొత్తం ఓసీలు 15.79 శాతం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రేవంత్ అసెంబ్లీలో ప్రకటించిన కులగణన సర్వేలో ముఖ్యమైన అంశాలు : 

తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని 04-02-2024 నిర్ణయించారు
10-10-2024న జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం 
సర్వేలో 75లో ప్రశ్నలు అడిగిన ఎన్యుమరేటర్లు 
150 కుటుంబాలను బ్లాక్‌గా 94,261 ఎన్యుమరేషన్ బ్లాక్‌లుగా విభజించారు. 
ప్రతి పది మంది ఎన్యురేటర్ల పర్యవేక్షణకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు. 
సర్వే కోసం 1,03,889 మంది సిబ్బందిని నియమించారు. 
6 నవంబర్‌ 2024న ఇంటింట సర్వే ప్రారంభమైంది. 
మొదటి దశలో మూడు రోజుల పాటు హౌసింగ్‌ లిస్ట్ చేశారు. 
రెండో దశలో నవంబర్‌ 9 నుంచి అసలు సర్వే ప్రారంభమైంది. 
6.11.2024న ప్రారంభమైన సర్వే 25.12.2024 న 50 రోజుల్లో ముగిసింది. 
1,12,15,134 కుటుంబాలపై సర్వే నిర్వహించారు. ఇందులో గ్రామాల్లో 66,99,602 - నగరాల్లో 45,15,532 కుటుంబాలు ఉన్నాయి. 
సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాలు -3,56,323
మొత్తం 3,54,77,554 మందిని సర్వే చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 
సర్వే ప్రకారం ఎస్సీల సంఖ్య- 61,84,319 మంది(17.43శాతం)
 సర్వే ప్రకారం ఎస్టీల సంఖ్య-37,05,929 మంది (10.45శాతం)
సర్వే ప్రకారం బీసీల(ముస్లింలుకాకుండా) సంఖ్య- 1,64,09,179 మంది(46.25శాతం)
సర్వే ప్రకారం ముస్లింల సంఖ్య- 44,57,012 మంది( 12.56శాతం)
సర్వే ప్రకారం ముస్లింలలో బీసీల సంఖ్య- 35,76,588 (10.08 శాతం)
సర్వే ప్రకారం ముస్లింలలో ఓసీల సంఖ్య- 8,80,424(2.48 శాతం)
సర్వే ప్రకారం రాష్ట్రంలో ఓసీల సంఖ్య- 56,01,539(15.79 శాతం) 
సర్వే ప్రకారం ఓసీల్లో ముస్లింల సంఖ్య- 8,80,424 (2.48శాతం)
సర్వే ప్రకారం ఓసీల్లో నాన్‌ముస్లింల సంఖ్య- 47,21,115(13.31 శాతం 

దేశంలో బలహీన వర్గాలకు సంబంధించి   1931 తర్వాత సమగ్ర సర్వే జరగలేదన్నారు. అందుకే భారత్ జోడోయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సమయంలో రాష్ట్రంలో కులగణన చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన పై అసెంబ్లీలో తీర్మానం చేసి, సర్వే ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేయడమే కాక నేడు నివేదికను సభలో ప్రవేశపెట్టామన్నారు.  

 ప్రతి గ్రామంలో తండాల్లో ఎన్యుమరేటర్లు పకడ్బందీగా వివరాలను సేకరించారన్నారు. ప్రతి 150 ఇళ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యుమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించామని తెలిపారు. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 36 రోజులు కష్టపడి ఈ నివేదికన రూపొందించారని, ఇందుకు రూ.160 కోట్లు ఖర్చు చేసి నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించినట్లు ప్రకటించారు. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తర్వాత సభలో ప్రవేశపెట్టామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Ponnam Prabhakar On SIR: ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తా, డేట్ ఫిక్స్ చెయ్- రాంచందర్‌రావుకు మంత్రి పొన్నం ఛాలెంజ్
ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తా, డేట్ ఫిక్స్ చెయ్- రాంచందర్‌రావుకు మంత్రి పొన్నం ఛాలెంజ్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget