PM Modi Letter to KCR : కేసీఆర్ సోదరి మృతి పట్ల ప్రధాని సంతాపం, బీఆర్ఎస్ అధినేతకు లేఖ రాసిన మోదీ
Telangana News: అనారోగ్యంతో బాధపడుతూ, మృతి చెందిన కేసీఆర్ సోదరి సకలమ్మకు సంతాపం తెలుపుతూ ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

PM Modi Letter to KCR : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల మృతి చెందిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ (82)కు ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఓ లేఖలో సంతాప సందేశాన్ని పంపించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ.. సకలమ్మ మరణానికి చింతిస్తున్నానని చెప్పారు. ఆ బాధ నుంచి ఆమె కుటుంబం త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ కు ప్రధాని లేఖ
సకలమ్మ మృతిపై సానుభూతి తెలుపుతూ ప్రధాని మోదీ, కేసీఆర్ కు లేఖ రాశారు. ఆమె నష్టం ఎప్పటికీ పూడ్చలేనిదని చెప్పారు. ఆమె కుటుంబానికి, మీకు సానుభూతి తెలుపుతున్నానని మోదీ రాశారు. సకలమ్మ మీ నుంచి దూరంగా వెళ్లిపోయినా.. జ్ఞాపకాల రూపంలో ఆమె ఎప్పుడూ మీతోనే, సజీవంగా ఉంటారని, అవి ఎన్నటికీ మీ నుంచి దూరం కావని చెప్పారు. కానీ ఆ బాధ నుంచి మీరు త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని కోరుకుంటున్నట్టు లేఖలో ఆకాంక్షించారు. ఆమె నేర్పిన మీ కుటుంబానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని, ఆమెతో గడిపిన జ్ఞాపకాలు ఈ కష్ట సమయంలో మీకు ఓదార్పునివ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఈ దుఃఖ సమయంలో మీ కుటుంబసభ్యులకు శక్తి, ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాని చెప్పారు. మరో పక్క ప్రధాని మోదీ ఈ లేఖ రాసిన విషయాన్ని తాజాగా బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ ఎక్స్‌లో జత చేశారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో ఉన్న కేసీఆర్, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారని క్యాప్షన్ లో రాశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అక్క చీటి సకలమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.
— BRS Party (@BRSparty) February 4, 2025
ఈ మేరకు కేసీఆర్ గారికి సంతాప సందేశాన్ని ప్రధాని పంపించారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో ఉన్న కేసీఆర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని… pic.twitter.com/TQ3ofz46du
సకలమ్మ గురించి
సకలమ్మ కేసీఆర్ కు ఐదవ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండిల పెదిర గ్రామం. ఆమె భర్త హన్మంతరావు కొన్నేళ్ల క్రితమే మరణించారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. అయితే కొంతకాలంలో వవృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న సకలమ్మ.. జనవరి 23న అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె జనవరి 24న రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రతి రాఖీ పండక్కి తన చేతికి రాఖీ కట్టే సకలమ్మ మరణ వార్తతో కేసీఆర్.. ఆమెతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాతి రోజు జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని, అక్కకు నివాళి అర్పించారు.
Also Read : Assembly Session: ఒక్క నిమిషంలోనే సభ వాయిదా వేయడంపై బీఆర్‌ఎస్ ఆగ్రహం.. అసెంబ్లీ చరిత్రలో నెవర్ బిఫోర్!





















