అన్వేషించండి

Revanth Reddy Chit Chat: సిరిసిల్లకు ఉపఎన్నిక వస్తుందా ?-అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను పరిగణనలోకి తీసుకోం - రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revanth: ఉపఎన్నికలు వస్తాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ భిన్నంగా స్పందించారు. సిరిసిల్లలో వస్తాయా అని అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు.

Revanth Reddy On Assembly: తెలంగాణలో కులగణన కేంద్రానికి దారి చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. 56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని.. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని తెలిపారు.  సభలో ప్రవేశపెట్టే డాక్యుమెంట్ భవిష్యత్ లో ఎపుడైనా రిఫరెన్స్ డాక్యుమెంట్ అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.            

కేంద్రానికి కూడా ఓ రోడ్ మ్యాప్ ఇస్తున్నాం !         

దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని.. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ ఉపసంఘం, ఏక సభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం వెళ్తామని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ది లేదన్నారు. వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి కదా అని ప్రశ్నించారు. కులగణన రాజకీయం కోసం చేయడం లేదు ఈ డాక్యుమెంట్ ను డెడికేటెడ్ కమిషన్ తీసుకుటుందని.. కమిషన్ తగిన నిర్ణయం తీసుకొంటుందన్నారు.       

సమగ్ర కుటంబ సర్వే రిపోర్టు ఎక్కడ ఉంది ?            

88 జనరల్ సీట్లలో 30 సీట్లు బీసీలకు ఇచ్చాం, 33 శాతం సీట్లు ఇచ్చామని తమకు చిత్తశుద్ది ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. కోర్టు ఇచ్చిన క్లిమిలేయర్ ను తిరస్కరించామని.. బీసీ రిజర్వేషన్ల పై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేశామన్నారు. కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అసెంబ్లీ కి రాని వారు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారుని విమర్శించారు. ఉదయమే సభ ప్రారంబించి వెంటనే వాయిదా వేయడంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వే గురించి కొంత మంది మాట్లాడుతున్నారని.. ఆ రిపోర్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదని రేవంత్ చెప్పుకొచ్చారు.      

సిరిసిల్లకు ఉపఎన్నికలు వస్తాయా ?            

సమగ్ర కుటుంబ సర్వే ఎవరు చేసారు.. ఎలా చేసారు..  ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలియదన్నారు. మేము ఎన్నికల కోసం కులగణన చేయలేదు..అభివృద్ధి ఫలాలు అందించడం కోసమే మా తాపత్రయం అంతా.. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు.. సిరిసిల్ల లో కేటీఆర్ సూసైడ్ చేసుకుంటడేమో అని వ్యంగ్యంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ప్రొసీజర్ లో భాగమని రేవంత్ అన్నారు. సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడంతో తాము ఉపఎన్నికలకు రెడీ అని కేటీఆర్  ట్వీట్ చేయడంపై రేవంత్ ఇలా స్పందించారు. 

Also Read: Indiramma Atmiya Bharosa Scheme: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
KTR Passport Seized: ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !
ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget