అన్వేషించండి

Formula E Case Adjourned: ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!

KTR Appears Nampally ACB Court: ఫార్ములా ఈ-రేసు కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. రూ.లక్ష పూచీకత్తు సమర్పించి బెయిల్ తీసుకున్నారు. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా.

ACB Chargesheet Formula E Race Hyderabad:  తెలంగాణ రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని సమన్లు జారీ చేయడంతో, కేటీఆర్‌తో పాటు మిగిలిన నిందితులు కోర్టు ముందు హాజరుకావాల్సి వచ్చింది. న్యాయస్థానం దర్యాప్తు ప్రక్రియలో భాగంగా నిందితులకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసులో ప్రథమ నిందితుడిగా ఉన్న కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ . హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి  కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వీరంతా రూ.లక్ష పూచీకత్తు  తో పాటు ఇద్దరు వ్యక్తుల షూరిటీలను కోర్టుకు సమర్పించి నిబంధనలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. కేటీఆర్ కోర్టుకు వచ్చే సమయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నాంపల్లి కోర్టు ప్రాంగణానికి చేరుకుని ఆయనకు మద్దతు తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ సీజన్-10కు సంబంధించి ఆర్థిక అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఏసీబీ అభియోగాలు నమోదు చేశారు. కేబినెట్, ఆర్థిక ,  న్యాయ శాఖల ముందస్తు అనుమతులు లేకుండానే యూకేకు చెందిన  ఫార్ములా ఈ ఆపరేషన్స్   సంస్థకు హెచ్‌ఎండీఏ ద్వారా రూ.55 కోట్లకు పైగా నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో దాదాపు 77 పేజీల విస్తృత ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన ఏసీబీ, 14 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పేర్కొంది.

 ఏసీబీ మోపిన అభియోగాలను కేటీఆర్ ,  బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా, ఆటోమొబైల్ హబ్‌గా నిలబెట్టేందుకే సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందులో ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేదా నిధుల దుర్వినియోగం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తమపై తప్పుడు కేసులు బనాయించిందని ఆయన మండిపడ్డారు. కుట్రపూరిత కేసులు తమ పోరాటాన్ని ఆపలేవని, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అంతిమంగా సత్యమే గెలుస్తుందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.  

కోర్టులో విచారణ ప్రక్రియ ముగిసిన అనంతరం కేటీఆర్ నాంపల్లి కాంప్లెక్స్ నుండి వెళ్లిపోయారు.  ఈ విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి ఏసీబీ కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విచారణను ఆగస్టు 25కు వాయిదా వేయడంతో, ఆ రోజు కోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇస్తుందనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.

 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Formula E Case Adjourned: ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
Breaking News:పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget