రష్మిక ప్రతి డ్రస్‌లోనూ అందంగా ఉంటారు. ఎత్నిక్ వేర్ అతీతం ఏమీ కాదు. కాబోయే పెళ్లి కుమార్తెలు రష్మిక లెహంగా డిజైన్లు చూడాలి. బ్లౌజ్ మీద మిర్రర్ వర్క్ చేయించడం కామన్! లెహంగా టాప్ మీద మిర్రర్ వర్క్ చేయిస్తే మెహందీ ఫంక్షన్‌కు సూపర్ రష్మిక ధరించిన సింపుల్ లెహంగా ఇది. అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు మినిమమ్ లుక్ తో ఇలా మేనేజ్ చేయవచ్చు సాధారణంగా బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ చేయిస్తారు. లెహంగా మీద వర్క్ చేయిస్తే పెళ్లి తర్వాత ఫంక్షన్లలో వేసుకోవచ్చు. మెహందీ, సంగీత్, బ్యాచిలర్ పార్టీ... పెళ్లికి ముందు ఏ ఫంక్షన్ అయినా సరే ఇలాంటి ట్రెండీ లెహంగా ధరించవచ్చు. బంగారంలా రష్మిక ధగధగ మెరిసిపోవడం లేదూ! ఈ లెహంగా రిసెప్షన్ కి అయితే బావుంటుంది. రిసెప్షన్ లేదా ఫ్రెండ్స్ పార్టీ... అందరిలో అమ్మాయి బ్రైట్ గా మెరిసిపోవాలంటే ఈ బ్లూ లెహంగా ధరిస్తే సరి! కాక్ టైల్ పార్టీకి ఈ విధంగా మెరిసిపోయే లెహంగా ధరిస్తే భలే ఉంటుంది కదూ! పెళ్లిలో ఈ రెడ్ కలర్ లెహంగా ధరిస్తే అందరి కళ్లు కొత్త పెళ్లి కూతురు మీద ఉండటం గ్యారంటీ. ఒకవేళ పెళ్లి రాత్రి వేళలో కాకుండా ఉదయం అనుకోండి... వైట్ లెహంగా అయితే సూపర్! దుప్పట్టా సింపుల్ అయితే ఇంకా సూపర్. కొత్త పెళ్లి కూతురు ఇటువంటి లెహంగా ధరించి అందరి ముందుకు వస్తే ఏమైనా ఉందా? అర్జంటుగా దిష్టి తీయించాలి. రష్మిక (all images courtesy: rashmika_mandanna / instagram)