ఇండియా, పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన గదర్: ఏక్ ప్రేమ్ కథ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ‘గదర్’కి సీక్వెల్‌గా వచ్చిన ‘గదర్ 2’ కూడా భారీ విజయం సాధించింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘వీర్ జారా’ కూడా ఈ లిస్ట్‌లోనే ఉంది. 2004లో వచ్చిన హయ్యస్ట్ గ్రాసర్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. సల్మాన్, కత్రినా ‘ఏక్ థా టైగర్’ కూడా ఈ కోవకు చెందినదే. ఇందులో ఏకంగా ఇండియా, పాకిస్తాన్ గూఢచారులు ప్రేమలో పడ్డట్లు చూపించారు. 2018లో వచ్చిన ‘రాజీ’ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాకిస్తానీయుడిని పెళ్లి చేసుకుని అక్కడి నుంచి భారత్ సమాచారం అందించే గూఢచారి కథే ఇది. అభిషేక్, కరీనాల రెఫ్యూజీ కూడా ఇలాంటి కథే. సరిహద్దులు దాటిన ప్రేమను ఇందులో చూడవచ్చు.