సమంత ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆమె ఇండోనేషియా బాలి జిమ్ క్లబ్ లో వర్కౌట్ చేస్తూ కనిపించింది. వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి ‘క్లబ్ లో మేం ఇలాగే పార్టీ చేసుకుంటాం’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. సమంత వర్కౌట్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బిజీ షెడ్యూల్స్ కారణంగా తన ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సమంత రీసెంట్ గా ‘ఖుషీ’ సినిమాలో చేసింది. ఆ మూవీ రీలీజ్ కు రెడీగా ఉంది. Image Credit: Samantha/Instagram