రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్‌ల ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ జులై 28న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ బిజీగా ఉన్నారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏడు సంవత్సరాల తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన సినిమా విడుదల కానుంది. 2016లో వచ్చిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ కరణ్ దర్శకత్వం వహించిన చివరి సినిమా. ఇప్పుడు మరోసారి ఫ్యామిలీ, లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఏకంగా రూ.260 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.