అన్వేషించండి

Prabhas: ఇన్​స్టాలో ఆ పోస్టులు చేసేది ప్రభాస్‌ కాదు... షాకింగ్ న్యూస్ బయట పెట్టిన మలయాళ స్టార్ హీరో

Prabhas : "ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్​ స్టాలో ఆ పోస్ట్‌ లు చేసేది ఆయన కాదు" అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు మలయాళ స్టార్ హీరో.

సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య వారధి లాంటిది సోషల్ మీడియా. డైరెక్ట్ గా కలిసి తమ అభిమాన నటీనటులతో మాట్లాడలేకపోయినప్పటికీ, ఈ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు చిట్ చాట్, కామెంట్స్, వాళ్లు షేర్ చేసే ఫోటోలు, వీడియోలతో సంతోష పడుతుంటారు అభిమానులు. ఇక ఎప్పుడైనా అభిమానులు చేసే కామెంట్స్ కి సెలబ్రిటీలు రియాక్ట్ అయితే ఆ సంతోషం అంతా ఇంతా కాదు. అలాగే మరో వైపు సెలబ్రిటీలు కూడా తమ ఫాలోవర్స్ కి సినిమాల అప్డేట్లు వంటివి సోషల్ మీడియా ద్వారానే షేర్ చేస్తూ ఉంటారు. 

ప్రభాస్ కు భారీ ఫాలోయింగ్ 
కొంతమంది సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు. మరి కొంతమంది అసలు సోషల్ మీడియా అకౌంట్లనే మెయింటైన్ చేయరు. ఇలాంటి వారి లిస్ట్ లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. ప్రభాస్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆయనకు 13 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మలయాళ స్టార్ హీరో "ప్రభాస్ ఇన్స్టాలో ఆ పోస్టులు చేసేది ఆయన కాదు" అంటూ బాంబ్ పేల్చారు. 

ఇన్​స్టాలో ఆ పోస్టులు చేసేది ప్రభాస్ కాదా?
ప్రభాస్ అభిమానులకు ఈ బ్యాడ్ న్యూస్ చెప్పిన ఆ మలయాళ స్టార్ హీరో మరెవరో కాదు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి 'సలార్' మూవీలో నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కాంబో 'సలార్ 2'లో కూడా రిపీట్ కాబోతోంది. ఇప్పటికైతే ఇటు ప్రభాస్, అటు పృథ్వీరాజ్ సుకుమారన్ తమ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తూనే, మరోవైపు దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. మార్చ్ 27 న మోహన్ లాల్ హీరోగా, పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'లూసిఫర్‌ 2 :ఎంపురాన్‌' రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన మనస్తత్వం చూసి ఆశ్చర్యపోతూనే,  ప్రభాస్ గురించి తనకు తెలిసిన కొన్ని సీక్రెట్స్ ను బయట పెట్టారు.

Also Read: 'తండేల్'తో పోటీ... 25 కుక్కలతో క్లైమాక్స్ షూట్... సాయి రామ్ శంకర్ క్లారిటీ

"ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారు. అసలు ఆయన తన స్టార్ డమ్ గురించి ఏమాత్రం పట్టించుకోరు. అంతే కాదు సోషల్ మీడియాపై ఆయనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఈ మాట చెప్పి మిమ్మల్ని అందరిని నిరాశ పరుస్తున్నందుకు క్షమించండి... ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్​ స్టాలో  నుంచి వచ్చే పోస్టులను షేర్ చేసేది ఆయన కానే కాదు. నిజానికి ప్రభాస్ కు చిన్న చిన్న ఆనందాలు అంటేనే ఇష్టం. ఆయన ఫామ్ హౌస్ లో ఉండడం, మొబైల్ పని చేయని ప్రాంతానికి వెళ్దామని అడగడం లాంటివి చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత పెద్ద స్టార్ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను కోరుకుంటున్నారా అనే ఆలోచన వస్తుంది" అంటూ ఓవైపు పొగుడుతూనే, మరోవైపు ప్రభాస్ సీక్రెట్ ని బయట పెట్టారు పృథ్వీరాజ్ సుకుమారన్. 

Also Readఉరి తీసిన 2 గంటల తర్వాత కూడా ఊపిరితో... రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Embed widget