ప్రభాస్ కటౌట్ ఉంటే మినిమమ్ 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ గ్యారెంటీ! ఆయన లాస్ట్ ఐదు సినిమాలను ఎంతకు అమ్మారంటే? ప్రభాస్ లేటెస్ట్ సినిమా 'సలార్'. దీనికి 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో బిజినెస్ బాగా జరిగింది. 'సలార్' వరల్డ్ వైడ్ రైట్స్ రూ. 345 కోట్లకు అమ్మారు. ప్రభాస్ కెరీర్‌లో ఇది సెకండ్ హయ్యస్ట్ అని చెప్పాలి. 'సలార్' కంటే 7 కోట్లు ఎక్కువ బిజినెస్ చేసింది 'బాహుబలి 2'. ఆ సినిమాను రూ. 352 కోట్లకు అమ్మారు. 'బాహుబలి 2', 'సలార్' తర్వాత మూడో స్థానంలో 'సాహో' నిలిచింది. ఆ సినిమాను రూ. 270 కోట్లకు అమ్మారు. 'సలార్'కు ముందు ప్రభాస్ నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 240 కోట్లు మాత్రమే. లవ్ స్టోరీ కావడం, 'సాహూ' తర్వాత రావడంతో 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 203 కోట్లకు జరిగింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడానికి పునాది వేసిన 'బాహుబలి 1' బిజినెస్ రూ. 118 కోట్లే. ప్రభాస్ లాస్ట్ ఐదు సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 1410 కోట్లు. ఒక్కో సినిమా ఏవరేజ్ చూస్తే... రూ. 280 కోట్లు!