![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Entertainment Top Stories Today: దేవర సక్సెస్ మీట్, దళపతి 69లో విలన్, రజనీ హెల్త్ అప్డేట్ - నేటి టాప్ సినీ న్యూస్
Entertainment News Today In Telugu: దేవర సినిమా సక్సెస్ మీట్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ హెల్త్ అప్డేట్, దళపతి విలన్, మట్కా రిలీజ్ డేట్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్!
![Entertainment Top Stories Today: దేవర సక్సెస్ మీట్, దళపతి 69లో విలన్, రజనీ హెల్త్ అప్డేట్ - నేటి టాప్ సినీ న్యూస్ Entertainment Top Stories In Telugu Rajinikanth Health Bulletin Thalapathy 69 Villain Devara Success Meet Matka Release Date October 1st 2024 Entertainment Top Stories Today: దేవర సక్సెస్ మీట్, దళపతి 69లో విలన్, రజనీ హెల్త్ అప్డేట్ - నేటి టాప్ సినీ న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/01/a172ac939a335e8bc5980cc48635aa401727786591524313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్పత్రిలో చేరిన వార్త అభిమానులతో ప్రేక్షకులను షాక్‌కి గురి చేసింది. ప్రజెంట్ ఆయన హెల్త్ అప్డేట్ నుంచి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర' సక్సెస్ మీట్, దళపతి 69లో విలన్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'మట్కా' రిలీజ్ డేట్ వరకు... నేటి టాప్ సినీ న్యూస్!
దేవర సక్సెస్ మీట్... ఎప్పుడు? ఎక్కడ అంటే?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) పాన్ ఇండియా సినిమా 'దేవర' మూడు రోజుల్లో 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డుల దిశగా దూసుకు వెళుతుంది. మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ... ఎన్టీఆర్ స్టార్ పవర్ థియేటర్లకు ప్రేక్షకులు వచ్చేలా చేసింది. సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు మరో గుడ్ న్యూస్... ఈ వారం 'దేవర' సక్సెస్ మీట్ (Devara Success Meet) జరగనుంది. (పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి)
రజనీకి ఏమైంది? ఆయన డిశ్ఛార్జి ఎప్పుడు?
సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆ సంగతి తెలిసి అభిమానులు ఆందోళన చెందారు. అయితే... వాళ్లకు ఆస్పత్రి వైద్యులు గుడ్ న్యూస్ చెప్పారు. రజనీకాంత్ హెల్త్ బులిటెన్ (Rajinikanth Health Bulletin) విడుదల చేయడంతో పాటు ఆయన్ను ఎప్పుడు డిశ్ఛార్జి చేసేదీ చెప్పారు. (పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి)
దళపతి 69లో విలన్ ఎవరో చెప్పేశారు...
అలాగే, 'గోట్' ఓటీటీ రిలీజ్ డేట్ కూడా!
దళపతి విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. అది విజయ్ 69వ సినిమా. దాని తర్వాత ఇక సినిమాలు చేయనని ఆయన చెప్పారు. అందులో విలన్ ఎవరు? అనేది ఇవాళ అనౌన్స్ చేశారు. దాంతో పాటు 'గోట్' ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఈ రోజే అనౌన్స్ చేశారు.
(దళపతి విజయ్ లాస్ట్ సినిమాలో Thalapathy 69 విలన్ ఎవరో తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
(నెట్‌ఫ్లిక్స్‌లో దళపతి విజయ్ 'గోట్' ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'మట్కా' థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా' రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి. (పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి)
షాహిద్ 'అశ్వత్థామ'లో జర్మనీ భామ - ఎవరీ దిల్బర్ ఆర్య?
పాన్ ఇండియా సినిమాలు చేసే బాలీవుడ్ హీరోలు తమ సరసన నటించే అందాల భామల (కథానాయికల) విషయంలో జాగ్రత్తగా తీసుకుంటారు. ఓ హిందీ హీరోయిన్ లేదంటే సౌత్ ఇండియాలోనూ గుర్తింపు ఉన్న హీరోయిన్ ఉండేలా చూసుకుంటారు. కానీ, షాహిద్ కపూర్ (Shahid Kapoor) అందుకు భిన్నంగా తనకు జోడిగా ఒక కొత్త కథానాయికకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఆయన హీరోగా రూపొందే 'అశ్వత్థామ'లో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా? (పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)