Perni Nani Rice Missing Case: పేర్ని నాని గోదాముల్లో బియ్యం మాయం కేసులో కీలక పరిణామం
Andhra Pradesh News | మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో మరికొందరు నిందితులను పోలీసులు గుర్తించారు. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Machilipatnam Ration Rice Missing Case | అమరావతి: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముల్లో బియ్యం తగ్గుదల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మచిలీపట్నంలోని గోదాముల్లో రేషన్ బియ్యం తగ్గుదల కేసులో మరో నలుగురు కొత్త నిందితుల్ని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్టైన నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. కానీ రెండో రోజు విచారణలో పేర్ని నాని, పేర్ని జయసుధల పీఏ మానస్ తేజ ఏ మాత్రం నోరు విప్పలేదు. బియ్యం మాయం కావడంలో ఎవరి పాత్ర లేదని, మొత్తం తానే చేశానని మాత్రమే చెబుతున్నాడు. నోటీసులు రావడంతో మానస్ తేజ విచారణకు హాజరవుతున్నా, విచారణకు ఏ మాత్రం సహకరించం లేదని.. అసలు విషయాలు దాచిపెడుతున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బియ్యం ప్రాసెస్ చేసి రైస్ మిల్లులకు
బియ్యం తగ్గిన కేసులో లారీ డ్రైవర్ మంగారావుని పోలీసులు విచారించారు. గోదాముల నుంచి మినీ లారీలో బియ్యం తీసుకువెళ్లి వాటిని మరింత ప్రాసెస్ చేసిన అనంతరం ఆంజనేయులు అనే రైస్ మిల్లుకు విక్రయించినట్లు విచారణలో మంగారావు తెలిపాడు. కానీ రైస్ మిల్లర్ ఆంజనేయులు వద్ద నుంచి ఐదుగురు వ్యక్తులు బియ్యం కొనుగోలు చేయగా.. వారిలో ఒకరు మృతి చెందారు. గోదాముల్లో బియ్యం మాయమైన వ్యవహారంలో 27 లక్షలు నగదు లావాదేవీలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగినట్లు గుర్తించారు. అయితే ఆ నగదు ఎవరి ఖాతాల్లోకి జమ చేశారు. ఆ ఖాతా ఎవరిది, నగదు లావాదేవీలు ఎందుకు జరిగాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరిట ఉన్న గోదాముల్లో బియ్యం మాయం కావడాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఏ1గా పేర్ని జయసుధ, ఏ2గా వారి పీఏ మానస తేజ ఉన్నారు. హైకోర్టును ఆశ్రయించి పేర్ని జయసుధ ముందస్త బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తరువాత పేర్ని నానిని సైతం నిందితుడిగా పోలీసులు కేసులో చేర్చారు. రేషన్ బియ్యం అమ్ముకుని వచ్చిన నగదును ఎన్నికల్లో ఖర్చు చేశారా, మరెదైనా పనులకు వినియోగించారా అని విచారణలో పేర్ని జయసుధను పోలీసులు ప్రశ్నించారు.
నిందితులను విచారిస్తున్న పోలీసులు
ఈ కేసులో ఏ3గా పౌరసరఫరాల శాఖ టెక్నికల్ డిపార్టమెంట్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, ఏ4గా లారీడ్రైవర్ బొట్ల నాగ మంగారావు, రైస్‌మిల్లును లీజుకు తీసుకుని నడిపిస్తున్న ఆంజనేయులును ఏ5గా ఉండగా పేర్ని నానిని ఏ6గా చేర్చడం తెలిసిందే. పేర్ని నాని దంపతులు మిగతా నిందితులను పోలీసులను అరెస్ట్ చేయగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. విచారణలో మరో నలుగురు నిందితులను గుర్తించిన పోలీసులు ఆ దిశగానూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏపీలో రేషన్ బియ్యం అవకతవకలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా కాకినాడ, విశాఖ పోర్టుల నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోవడంపై ఫోకస్ చేసింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది.
Also Read: Pawan Kalyan: విజయవాడ బుక్ ఫెయిర్‌లో రూ.5 లక్షల బుక్స్ కొన్న పవన్ కళ్యాణ్, ఓ బుక్ చూడగానే సంతోషం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

