అన్వేషించండి

Rythu Bharosa Scheme Guidelines: రైతు భరోసా పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం, తెలుగులోనే ఉత్తర్వులు

Rythu Bharosa Guidelines | తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.12 వేల రూపాయలు అందించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.

Guidelines for Rythu Bharosa scheme in Telangana | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26 వ తేదీ నుంచి అన్నదాతలకు రైతు భరోసా పథకిం అందించనుంది. రాష్ట్రంలోని రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భూ భారతి పోర్టల్‌ (Bhu Bharati Portal)లో నమోదైన రైతులు వ్యవసాయం చేస్తున్న భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నారు. ఈ మేరకు రైతు భరోసాపై తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నంబర్ 18 / తేదీ 10-01-2025) జారీ చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో రైతు భరోసా జీవోను తెలుగులో వెలువరించింది. గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపైన తెలుగులో జీవో జారీ చేయడం తెలిసిందే.  #RythuBharosa

జనవరి 26న రైతు భరోసా అమలు

తెలంగాణ ప్రభుత్వం వ్వవసాయాన్ని లాభసాటిగా చేయడానికి నిర్ణయాలు తీసుకుంటుందని.. రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని రైతు భరోసా కింద రూ. 12 వేలు ఇవ్వనుందని అధికారులు తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయంతో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలుంటుందని తాజా ఉత్తర్వులలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం "రైతు భరోసా" పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయనుంది. 

రైతుభరోసా పథకం (Rythu Bharosa)లోని ముఖ్యాంశాలు:

3.1 రైతు భరోసా స్కీమ్ కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12,000 కు పెంచాం.

3.2 భూభారతి (Dharani To Bhu Bharati Portal) పోర్టల్ లో నమోదైన వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని పట్టాదారుల భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.

3.3 ROFR పట్టాదారులు కూడా రైతు భరోసా పంట పెట్టుబడికి అర్హులు.

3.4 ఆర్బీఐ నిర్వహించే DBT విధానంలో రైతు భరోసా సహాయం అన్నదాతల బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.

3.5 రైతు భరోసా పథకాన్ని వ్యవసాయశాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున అమలు చేస్తారు.

3.6 National Informatics Centre (నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్), IT భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.


Rythu Bharosa Scheme Guidelines: రైతు భరోసా పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం, తెలుగులోనే ఉత్తర్వులు

3.7  తమ జిల్లాకు సంబంధించిన రైతు భరోసా పథకం అమలుతో పాటు ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారు.

4. వ్యవసాయశాఖ సంచాలకులు ఈ పథకం అమలు విషయంలో తగు చర్యలు తీసుకోవాలి.

5. 2909660-A/06/A1/EBS.II/2025, తేదీ 10.01.2025 తో జారీ చేశారు

(తెలంగాణ గవర్నరు ఉత్తర్వు మేరకు ఏపిసి అండ్ ప్రభుత్వ కార్యదర్శి యం.రఘునందన్ రావు రైతు భరోసాకు సంబంధించి ఉత్వర్వులు జారీ చేశారు.

.


Rythu Bharosa Scheme Guidelines: రైతు భరోసా పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం, తెలుగులోనే ఉత్తర్వులు

 

 

Also Read: Vande Bharat: రైల్వేశాఖ గుడ్ న్యూస్, సికింద్రాబాద్‌ - విశాఖపట్నం వందేభారత్‌ కోచ్‌లు రెట్టింపు, భారీగా పెరిగిన సీట్లు 

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఎకరానికి రూ.15వేలు అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 3 వేలు తగ్గించి రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు కూలీలకు ఇంకా రూ.12 వేలు ఇవ్వడం మొదలుపెట్టలేదని, ఏడాది పాలన పూర్తైనా నిర్ణయం కూడా తీసుకోలేదని మండిపడుతున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget