Ashwatthama The Saga Continues: షాహిద్ కపూర్ 'అశ్వత్థామ'లో జర్మనీ భామ - ఎవరీ ఆర్య? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Delbar Arya In Shahid Kapoor Movie: షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటించనున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'అశ్వత్థామ: ద సాగా కంటిన్యూస్'. ఇందులో నాయికగా జర్మనీ భామను ఎంపిక చేశారు. ఆవిడ ఎవరో తెలుసా?
పాన్ ఇండియా సినిమాలు చేసే బాలీవుడ్ హీరోలు తమ సరసన నటించే అందాల భామల (కథానాయికల) విషయంలో జాగ్రత్తగా తీసుకుంటారు. ఓ హిందీ హీరోయిన్ లేదంటే సౌత్ ఇండియాలోనూ గుర్తింపు ఉన్న హీరోయిన్ ఉండేలా చూసుకుంటారు. కానీ, షాహిద్ కపూర్ (Shahid Kapoor) అందుకు భిన్నంగా తనకు జోడిగా ఒక కొత్త కథానాయికకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఆయన హీరోగా రూపొంది 'అశ్వత్థామ'లో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా?
షాహిద్ కపూర్ సరసన దిల్బర్ ఆర్య!
దిల్బర్ ఆర్య (Delbar Arya)... ఈ అమ్మాయి గురించి తెలుగు ప్రేక్షకులకు కాదు... హిందీ సినిమా ప్రేక్షకులు చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు ఈమె ఒక్కటంటే ఒక్క హిందీ సినిమా కూడా చేయలేదు. ఆ మాటకు వస్తే... మిగతా భారతీయ భాషల్లోనూ భారీ సినిమాలు ఏవీ చేయలేదు. కానీ, రెండు మ్యూజిక్ వీడియోస్ ద్వారా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా షాహిద్ కపూర్ సరసన 'అశ్వత్థామ'లో నటించే అవకాశం అందుతుంది దిల్బర్ ఆర్య.
Also Read: 'గోట్' ఓటీటీ రిలీజ్... ఈ వారమే నెట్‌ఫ్లిక్స్‌లో దళపతి విజయ్ సినిమా, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
View this post on Instagram
ఎవరి దిల్బర్ ఆర్య? ఆమె నేపథ్యం ఏమిటి?
Delbar Arya Background: దిల్బర్ ఆర్య... జర్మనీలో జన్మించింది. ఆమె తండ్రిది ఇరాన్. ఆయన నటుడు. సుమారు 50 ఏళ్ళు ఇరానీ సినిమాలు, స్టేజి షోలు చేశారు. ఆమె తల్లి గాయని.
పంజాబీ మ్యూజిక్ వీడియో 'డౌన్ టౌన్'లో సింగర్ గురు రంధావాతో కలిసి సందడి చేశారు దిల్బర్ ఆర్య. అది ఆమెకు చాలా పాపులారిటీ తెచ్చింది. ఆ తర్వాత 'పీఆర్' అని ఓ పంజాబీ సినిమాలో నటించారు. తర్వాత మరో సినిమా, మ్యూజిక్ వీడియో చేశారు. ఆమెకు పాన్ ఇండియా సినిమాలో అవకాశం ఇచ్చారు షాహిద్ కపూర్.
షాహిద్ కపూర్ 'అశ్వత్థామ'లో శివరాజ్ కుమార్!
'అశ్వత్థామ' చిత్రాన్ని కన్నడ దర్శకుడు సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నట్లు సినిమా అనౌన్స్ చేసిన రోజున తెలిపారు.
View this post on Instagram
'అశ్వత్థామ' చిత్ర నిర్మాతలలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ ఒకరు. ఇందులో కన్నడ కంఠీరవ తనయుడు, శాండిల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఓ పాత్ర చేస్తున్నారట. మైథాలజీ నేపథ్యంలో మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర స్ఫూర్తితో సూపర్ హీరో సినిమాను రూపొందిస్తున్నారు.