అన్వేషించండి

OTT Movies: పదికి పైగా సినిమాలు... వెబ్ సిరీస్‌లకు లెక్క లేదు - ఈ వారంలో ఏ ఓటీటీలో ఏవేవి స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?

OTT This Week: నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహా, సోనీ లివ్ ఓటీటీల్లో ఈ వారం ఏయే వెబ్ సిరీస్‌లు, సినిమాలు వస్తున్నాయి? అనేది తెలుసుకోండి.

అక్టోబర్ మొదటి వారంలో పది సినిమాలు ఓటీటీల్లోకి వస్తున్నాయి. డైరెక్టుగా రిలీజ్ అయ్యేవి కొన్ని అయితే... థియేటర్లలో విడుదలైన తర్వాత వచ్చేది మరికొన్ని. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే... సుమారు పది వరకు ఉన్నాయి. ఏయే ఓటీటీల్లో ఏవేవి వస్తున్నాయో తెలుసా? ఒక లుక్ వేయండి.

అక్టోబర్ 4న ఆహాలో ఒరిజినల్ ఫిలిం రిలీజ్!
Balu Gani Talkies Streaming Date: నటుడు శివ రామచంద్ర వరపు హీరోగా, నటుడు - సంగీత దర్శకుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బాలు గాని టాకీస్'. ఆహా ఓటీటీ వేదిక కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ఓ ఊరిలో థియేటర్ చుట్టూ తిరుగుతుంది. అందులో ఎలాగైనా కొత్త సినిమా విడుదల చేయాలని హీరో ప్రయత్నిస్తాడు. తర్వాత ఏమైంది? అనేది ఆహాలో చూడాలి. 

నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ జంటగా... ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో నటించిన సినిమా '35 - చిన్న కథ కాదు'. థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. ఇప్పుడీ సినిమాను అక్టోబర్ 2వ తేదీ నుంచి ఓటీటీ వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది ఆహా. 

Also Read: థియేటర్లలోకి ఈ వారం సందడి - ఒక్క శుక్రవారమే 8 తెలుగు సినిమాలు, ఇంకా...

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

ప్రైమ్ వీడియోలో యోగిబాబు తమిళ సినిమా 'బోట్'
తెలుగు ప్రేక్షకులలో సైతం మంచి క్రేజ్ ఉన్న తమిళ హాస్య నటుడు యోగిబాబు (Yogi Babu). ఆయన ప్రధాన పాత్రలో చింబు దేవన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా 'బోట్'. ఇందులో '96' ఫేమ్ గౌరీ జి కిషన్ మరో ప్రధాన పాత్ర చేశారు. ఈ సినిమా తమిళనాడు థియేటర్లలో ఆగస్టు 2న విడుదల అయ్యింది. ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

  • హారర్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఇంగ్లీష్ సినిమా 'హౌస్ ఆఫ్ స్పాయిల్స్' అక్టోబర్ 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
  • సైన్స్ ఫిక్షన్ ఫాంటసీలో రూపొందిన హాలీవుడ్ యానిమేషన్ వెబ్ సిరీస్ 'ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మచిన: సీజన్' కూడా 3వ తేదీ నుంచి వీక్షకులకు అందుబాటులోకి రానుంది.
  • ప్రముఖ కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన 'ది ట్రైబ్' వెబ్ సిరీస్ అక్టోబర్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

'జీ 5' ఓటీటీలో అనుపమ్ ఖేర్ సినిమా డైరెక్ట్ రిలీజ్!
అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిందీ సినిమా 'ది సిగ్నేచర్'. మరాఠీలో 2013లో విడుదలైన 'అనుమతి' సినిమా ఆధారంగా తెరకెక్కించారు. 'జీ 5' ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన ఒరిజినల్ ఫిల్మ్ ఇది. మహిమా చౌదరి, రణ్వీర్ షోరే తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 4న డైరెక్టుగా 'జీ 5' ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 (@zee5)

జియో సినిమాలో 'అమర్ ప్రేమ్ కి ప్రేమ్ కహాని'
జియో సినిమా ఓటీటీలో అక్టోబర్ 4న 'అమర్ ప్రేమ్ కి ప్రేమ్ కహాని' సినిమా విడుదల అవుతోంది. ఇందులో ఆదిత్య సియల్, సన్నీ సింగ్ నిజ్జర్ నటించారు. హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించారు. ఇదొక రొమాంటిక్ కామెడీ సినిమా. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioCinema (@officialjiocinema)

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ వారం వచ్చేవి ఏమిటి?
'లైగర్' బ్యూటీ అనన్యా పాండే ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిందీ సినిమా 'CRTL'. ఇదొక హారర్ థ్రిల్లర్. విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహించారు. ఇందులో విహాన్ సమత్, దేవికా వస్త, కామాక్షి ఇతర పాత్రలు చేశారు. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ సినిమా ఇది. అక్టోబర్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Also Read'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు డెబ్యూ - తమిళ్ రీమేక్‌తోనే, హీరోలు ఎవరో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

  • సైన్స్ ఫిక్షన్ కామెడీ హారర్ 'ఇట్స్ వాట్స్ ఇన్‌సైడ్' సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
  • హాలీవుడ్ వెబ్ సిరీస్ 'మేకింగ్ ఇట్ మార్బెల్లా' అక్టోబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
  • స్టాండప్ కామెడీ లాంటి 'టిమ్ దిల్లాన్: థిస్ ఈజ్ యువర్ కంట్రీ' కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
  • అక్టోబర్ 2వ తేదీ నుంచి 'లవ్ ఈజ్ బ్లైండ్: సీజన్ 7' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
  • 'హార్ట్ స్టాపర్: సీజన్ 3' వెబ్ సిరీస్ అక్టోబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
  • యానిమేషన్ వెబ్ సిరీస్ 'నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ సీజన్ 2: పార్ట్ 2' కూడా 3వ టీడీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
  • స్పానిష్ హారర్ థ్రిల్లర్ 'ది ప్లాట్‌ఫార్మ్ 2' అక్టోబర్ 4న విడుదల అవుతోంది.
  • సోనీ లివ్ ఓటీటీలో మరాఠీ వెబ్ సిరీస్ 'మన్వత్ మర్డర్స్' అక్టోబర్ 4న విడుదల అవుతోంది.
  • హొయ్ చోయ్ ఓటీటీలో అక్టోబర్ 2 నుంచి 'మోహిషాశుర్ మర్ధిని' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Vivo X200 Pro: దాదాపు రూ.లక్ష ధరతో వచ్చిన వివో ఎక్స్200 ప్రో - అంత రేటు వర్తేనా?
దాదాపు రూ.లక్ష ధరతో వచ్చిన వివో ఎక్స్200 ప్రో - అంత రేటు వర్తేనా?
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Embed widget