అన్వేషించండి

Telangana News: తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!

Revanth Reddy Vs KTR: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి, కేటీఆర మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. కేసీఆర్‌ను తెలంగాణ చరిత్ర అని ఫినిష్ చేయడం ఎవరి తరం కాదన్నారు.

Telangana News: తెలంగాణలో మరోసారి కేసీఆర్ కేంద్రంగా అధికార ప్రతిపక్షాల మధ్య వార్ షురూ అయ్యింది. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అంటే... అంత సీన్ లేదు... ఆయన తెలంగాణతో ముడిపడిన వ్యక్తి అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నాడు విలేకర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి... తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. 

ఉదయం పది గంటలక ట్వీట్ చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌..." నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు! నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు! నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు!నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరి పోసాడు! చిట్టినాయుడు! నువ్వా! KCR పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర KCR!" అంటూ తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారు...
సియోల్ వెళ్లి వచ్చిన మీడియా ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందన్నారు. ఆయనో కాలం చెల్లిన ఔషధంగ అభివర్ణించారు. కేసీఆర్‌ను టార్గెట్ చేయడానికి కేటీఆర్‌ను ఉపయోగించుకున్నానని... ఇప్పుడు కేటీఆర్ కోసం హరీష్‌ను వాడతానని అన్నారు. తర్వాత హరీష్‌ను ఎలా డీల్ చేయాలో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి రాజకీయ ఉనికి లేకుండా చేస్తానని అన్నారు. 

దీపావళి అంటే ఎక్కడైనా చిచ్చుబుడ్లుతో పండగ చేసుకుంటారని కానీ సారాబుడ్లతో పండగ ఏంటని ప్రశ్నించారు రేవంత్. అక్కడ ఎలాంటి తప్పులు చేయకుంటే రాజ్‌పాకాల ెందుకు పారిపోయారని నిలదీశారు. దీపావళి తర్వాత బాంబులు పేలుతాయన్న మంత్రుల కామెంట్స్‌పై కూడా రేవంత్ స్పందించారు. ఫోన్‌ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్‌ కొనుగోళ్ల కేసుల్లో విచారణ సాగుతోందని ఏమైనా జరగొచ్చని అన్నారు. అయితే కక్షపూరిత చర్యలు మాత్రం ఉండబోవని స్పష్టం చేశారు. విచారణ చేసిన సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

పని తీరులో తనది రాజ్‌మౌళి స్టైల్ అన్నారు రేవంత్ రెడ్డి. తనకు ఏం కావాలో ప్రజలు ఇచ్చారని... ఇప్పుడు ప్రజలకు ఏం కావాలో ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాజకీయంగా కొంత నష్టం ఉన్నప్పటికీ ప్రజలకు మేలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే పాలన సాగిస్తున్నామన్నారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చెప్పుకొచ్చారు.

రియల్ ఎస్టేట్‌ తగ్గడం ఒక్క తెలంగాణలోనే జరగలేదని... ఆర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా పరిస్థితి అలానే ఉందన్నారు రేవంత్. హైడ్రా పేరుతో చెరువుల్లో అక్రమంగా బలిసినోళ్లు కట్టిన నిర్మాణాలనే కూల్చేశామన్నారు. పేదోళ్ల జోలికి అసలు వెళ్లలేదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంపై కూడా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పైసా ఖర్చు లేకుండానే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 5 సంస్థల కన్సార్సియంకు మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేసే బాధ్యత అప్పగిచామన్నారు రేవంత్. 18 నెలల్లో డీపీఆర్‌ వస్తుందని... దాని ఆధారంగా మేలైన మోడల్‌ ఎంచుకుని పనులు చేపడతామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
Argentina vs Spain World Cup Final Hyderabad: ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget