Nara Lokesh: డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని అమెజాన్, సేల్స్ ఫోర్స్ ఏఐ, రెవేచర్ సంస్థలను ఆహ్వానించారు నారా లోకేష్. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో పాల్గొన్నారు.
Nara Lokesh America Tour: అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్ లాస్ వెగాస్‌లో నిర్వహిస్తున్న ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో పాల్గొన్నారు. వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని వారికి రిక్వస్ట్ చేశారు. ఏపీలో ఉన్న మానవ వనరులు, భూమి లభ్యత, వాతావరణ పరిస్థితులు వారికి వివరించారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిసి ఏపీలో పెట్టుబడుల అవకాశాలు పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు లోకేష్. "క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు AWS నాయకత్వం ఉపకరిస్తుంది. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఎపి ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో AWS క్లౌడ్ సేవలు కీలక పాత్ర వహించే అవకాశాలున్నాయి. ఏఐ &మిషన్ లెర్నింగ్‌లో మీరు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధత ఏపీని ఎఐ ఇన్నొవేషన్ కేంద్రంగా మార్చాలన్న మా ఆశయానికి ఊతమిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్ మెరుగుదల, –ఈ-గవర్నెన్స్ కార్యకమాలకు AWS సహకారం అందించాలి"అని కోరాను.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిసి ఎపిలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశాను.
— Lokesh Nara (@naralokesh) October 30, 2024
"క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు AWS నాయకత్వం ఉపకరిస్తుంది. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఎపి… pic.twitter.com/oy5UJ2cwT9
పెప్సికో మాజీ ఛైర్మన్ &సిఇఓ ఇంద్రానూయితో భేటీ అయ్యాను. చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని వివరించారు. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో పెప్సికో భాగస్వాములు అవ్వాలని కోరారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పెప్సికో మాజీ చైర్మన్ & సిఇఓ ఇంద్రా నూయితో లాస్ వెగాస్‌లో నిర్వహిస్తున్న ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యాను. విజనరీ లీడర్ చంద్రబాబుగారి నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని వివరించాను.… pic.twitter.com/LSnoUugNcx
— Lokesh Nara (@naralokesh) October 30, 2024
సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షిహ్‍తో భేటీ అయ్యారు. టెక్ స్టార్టప్‍లకు ఏఐ టూల్స్, మెంటార్ షిప్ అందించాలని.. ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు శిక్షణ ఇవ్వాలని కోరారు. విద్యాసంస్థలతో సేల్స్ ఫోర్స్ సంస్థ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి రెవేచర్ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటి నైపుణ్యాల్లో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.
సినర్జీ సమ్మిట్ సందర్భంగా సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షిహ్‍తో భేటీ అయ్యాను. టెక్ స్టార్టప్‍లకు ఏఐ టూల్స్, మెంటార్ షిప్ అందించాలని .. ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు శిక్షణ ఇవ్వాలని కోరాను. విద్యాసంస్థలతో సేల్స్ ఫోర్స్ సంస్థ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశాను. pic.twitter.com/T0t3srhJrD
— Lokesh Nara (@naralokesh) October 30, 2024
ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ సందర్భంగా రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్‌తో సమావేశమయ్యాను. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి రెవేచర్ భాగస్వామ్యం వహించాలని కోరాను. రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటి… pic.twitter.com/GPEpp9A1GN
— Lokesh Nara (@naralokesh) October 30, 2024