మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP Desam
సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి సినిమా పనులు వేగం అందుకున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకుని ప్రీ పొడక్షన్ పనులు స్పీడప్ చేసిన జక్కన్న ఇప్పుడు లొకేషన్ల వేటలో పడ్డారు. అందులో భాగంగానే ఎస్ ఎస్ కార్తీకేయతో కెన్యాలో తిరుగుతున్నారు జక్కన్న. కెన్యాలోని అంబోసెలీ నేషనల్ పార్క్ లో వైల్డ్ సఫారీ చేస్తున్న రాజమౌళి ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేశారు కార్తీకేయ. తాజాగా రాజమౌళి పంచుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. ఎడారి ప్రాంతంలో తను తిరుగుతున్న ఫోటోను షేర్ చేసిన జక్కన్న అందులో 'కనుగొనడం కోసం తిరుగుతున్నాను' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇక ఆ పిక్ చూసాక ఆయన మహేష్ సినిమా కోసమే లొకేషన్ లో వేటలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి ఆ ఫోటోను షేర్ చేయడమే ఆలస్యం వెంటనే మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్ ని షేర్ చేయండి అంటూ మెసేజ్ బాక్స్ ను నింపేస్తున్నారు.