Nandamuri Taraka Ramarao First Darshan: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ... ఎన్టీఆర్ స్పెషల్ విషెస్, హరికృష్ణ మనవణ్ణి చూశారా?
YVS Chowdary: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్న వేళ నందమూరి అభిమానులతో పాటు హీరోలు కూడా వెల్కమ్ పలుకుతున్నారు. తారక్ స్పెషల్ గా విష్ చేశారు.
నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి మరో కొత్త హీరో పరిచయం కాబోతున్నారు. ఆయన మరెవరో కాదు నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు తారక రామారావు. ఈ యంగ్ స్టర్ హీరోగా టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నారు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ కొత్త హీరోతో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ మీద వైవిఎస్ భార్య గీత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వైవిఎస్ చౌదరి ఎన్టీఆర్ ను పరిచయం చేస్తూ ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ అప్ కమింగ్ హీరోకి వెల్కమ్ విషెస్ వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తారక రామారావుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ చేసిన స్పెషల్ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ తన ఎక్స్‌లో "సినీ ప్రపంచంలో నీ మొదటి అడుగుకు అభినందనలు రామ్. సినీ ప్రపంచం నిన్ను ఆదరించడానికి వెయిట్ చేస్తోంది. నువ్వు చేసే ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్ ల ఆశీస్సులు, ప్రేమ నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నువ్వు అతి తొందరలోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటావని నమ్ముతున్నాను. నీ భవిష్యత్తు దేదీప్యమనంగా వెలగాలి" అంటూ ఎన్టీఆర్ రాస్కొచ్చారు.
All the best on the first of many steps Ram. The world of cinema will offer you countless moments to cherish… Wishing you nothing but success! With the Love and blessings of your great grandfather NTR garu, grandfather Harikrishna garu and father Janakiram anna, I’m sure you’ll… pic.twitter.com/Op1jRr6KQ7
— Jr NTR (@tarak9999) October 30, 2024
ఎన్టీఆర్ మాత్రమే కాదు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త వారసుడు తారక రామారావుకు విష్ చేశారు. "నీకు శుభాకాంక్షలు డియర్ రామ్. తొలి సినిమాతోనే నువ్వు అందరూ గర్వపడేలా చేస్తావని నమ్మకం ఉంది" అంటూ తన ఎక్స్ లో రాసుకొచ్చారు కళ్యాణ్ రామ్. ఇదిలా ఉండగా మరోవైపు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తారక రామారావు ఎంట్రీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. అందులో "ప్యాషన్, ప్రతిజ్ఞ, ప్రామిస్... సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులతో నందమూరి తారక రామారావు ఇండియన్ సినిమాలోకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు" అంటూ ట్వీట్ చేసి అందరికీ పరిచయం చేశారు.
తారక రామారావు ఎంట్రీకి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేయగా, అందులో ఈ యంగ్ నందమూరి హీరో స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. "నేను నందమూరి తారక రామారావు అనే నేను ఊహ తెలిసినప్పటి నుంచి నటన పట్ల మక్కువ పెంచుకొని, గత 18 నెలలుగా వైవిఎస్ చౌదరి గారి దగ్గర అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది, ఆయన దర్శకత్వంలోనే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న నేను.. ఎందరో మహోన్నత నటీనటులు సాంకేతిక నిపుణులతో జగద్యేదీయమానమవుతున్న మన చలనచిత పరిశ్రమ పట్ల నిజమైన విధేయత, విశ్వాసం చూపుతానని.. దాని సమగ్రతను కాపాడుతానని, కథా రచయిత, దర్శక నిర్మాతల సంతృప్తి మేరకు కథలు సన్నివేశాలు పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపచేస్తానని, నా వంతు నిరంత కృషి చేస్తానని నా ముత్తాత నా దైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.