Nara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP Desam
ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో ఏపీ ఐటీశాఖ మంత్రి నారాలోకేశ్ భేటీ అయ్యారు. రెడ్ మండ్ లోని మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీస్ కి వెళ్లిన లోకేశ్ సీఈఓ సత్యనాదెళ్లను కలిశారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ మీద చర్చించిన సత్యనాదెళ్లను ఏపీలో విజిట్ చేయాల్సిందిగా లోకేశ్ ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నట్లు తెలిపిన లోకేశ్..ప్రపంచస్థాయి టెక్నాలజీ సెంటర్లుగా వాటిని తీర్చిదిద్దటానికి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు అవసరం అనిచెప్పారు. లోకేశ్ మాటలకు సత్యనాదెళ్ల సానుకూలంగా స్పందించినట్లు ఐటీశాఖమంత్రి కార్యాలయం తెలిపింది. నిన్న ఆస్టిన్ లోని టెస్లా హెడ్ ఆఫీస్ కు వెళ్లిన సీఎఫ్ వో వైభవ్ తనేజాను కలిశారు లోకేశ్. అనంతపురం జిల్లాను టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని వైభవ్ తనేజాకు తెలిపారు లోకేశ్. సీఎం చంద్రబాబు సరికొత్తగా తీసుకువచ్చిన ఐటీ పాలసీని అమెరికా పర్యటనలో ఆయా కంపెనీల అధినేతలకు నారా లోకేశ్ వివరిస్తున్నారు.