Telugu Movies: థియేటర్లలోకి ఈ వారం సందడి - ఒక్క శుక్రవారమే 8 తెలుగు సినిమాలు, ఇంకా...
Telugu Movies 2024: దసరాకు ముందు థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమాలు ఏవి? హిందీ సినిమాలు ఏం ఉన్నాయి? ఇంగ్లీష్ సినిమాలు ఏం ఉన్నాయి? ఈ వారం థియేట్రికల్ రిలీజులు ఏంటి? అనేది చూస్తే...
ప్రతి శుక్రవారం థియేటర్లలోకి కొత్త సినిమాలు రావడం కామన్. కానీ... ఈ మధ్య గురువారం, సెలవులు ఉంటే ఒక్కోసారి ముందు కూడా సినిమాలు వస్తున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'దేవర' రిలీజ్ ఉండటంతో గత శుక్రవారం తెలుగు సినిమాలు ఏవీ విడుదల కాలేదు. కార్తీ, అరవింద్ స్వామి హీరోలుగా నటించిన తమిళ డబ్బింగ్ 'సత్యం సుందరం' ఒక్కటే వచ్చింది. మరి, ఈ శుక్రవారం ఏయే సినిమాలు ఉన్నాయి? థియేటర్లలోకి ఏయే సినిమాలు వస్తున్నాయి? అనేది ఒక్కసారి చూస్తే...
గాంధీ జయంతికి 'జోకర్ 2'
Joker Folie à Deux release date in India: జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో వచ్చిన హాలీవుడ్ సినిమా 'జోకర్' ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. సుమారు 9000 వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఆ సినిమా సీక్వెల్ 'జోకర్ 2' (జోకర్ ఫోలి ఆ దు) గాంధీ జయంతి నాడు (అక్టోబర్ 2న) థియేటర్లలోకి వస్తోంది. అమెరికా కంటే రెండు రోజుల ముందు ఇండియాలో విడుదల అవుతోంది. దీనిపై ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.
'జోకర్ 2' అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తుంటే... అక్టోబర్ 4వ తేదీన ఒక్క రోజే ఎనిమిది అంటే 8 తెలుగు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అందులో శ్రీ విష్ణు 'స్వాగ్' సినిమాకు ఎక్కువ క్రేజ్ ఉంది. అది కాకుండా ఇంకా ఏయే సినిమాలు ఉన్నాయి? ఎవరెవరి సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి? అంటే...
అక్టోబర్ 4న థియేటర్లలోకి శ్రీవిష్ణు 'స్వాగ్'
హీరో శ్రీ విష్ణు (Sree Vishnu), దర్శకుడు హసిత్ గోలి కలయికలో 'రాజ రాజ చోర' వంటి హిట్ సినిమా వచ్చింది. వారిద్దరి కలయికలో తెరకెక్కిన తాజా సినిమా 'స్వాగ్'. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ముఖ్యంగా శ్రీ విష్ణు గెటప్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. అక్టోబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇందులో రీతూ వర్మ కథానాయికగా కాగా... మరో ముగ్గురు అందాల భామలు మీరా జాస్మిన్, దక్షా నాగర్కర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. సునీల్ ఇంపార్టెంట్ రోల్ చేశారు.
Also Read: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్... అక్కడ ఫస్ట్ టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టారే!
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమా కూడా!
శ్రీ విష్ణు 'స్వాగ్' కాకుండా... యాటిట్యూడ్ స్టార్, ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటించిన 'రామ్ నగర్ బన్నీ' అక్టోబర్ 4న విడుదల అవుతోంది. అందులో నలుగురు హీరోయిన్లు విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర నటించారు. ట్రోల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు... చంద్రహాస్ డిస్కషన్ టాపిక్ అయ్యాడు. అందువల్ల,అతని సినిమా కోసం చూసే ప్రేక్షకులు కొంత మంది ఉన్నారు.
'కబాలి' సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెగా నటించిన సాయి ధన్సిక గుర్తు ఉన్నారా? ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన 'దక్షిణ'తో పాటు పరుచూరి మనవడు సుదర్శన్ హీరోగా పరిచయం అవుతున్న 'మిస్టర్ సెలబ్రిటీ', 'రోటి కపడా రొమాన్స్', 'యమకంత్రి', 'బహిర్భూమి', 'కాళీ' సైతం అక్టోబర్ 4న థియేటర్లలోకి వస్తున్నాయి. సెప్టెంబర్ 27న తమిళంలో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన 'పేట ర్యాప్' విడుదల అయ్యింది. ఆ సినిమాను తెలుగులో అక్టోబర్ 3న విడుదల చేస్తున్నారు.
Also Read: 'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు డెబ్యూ - తమిళ్ రీమేక్‌తోనే, హీరోలు ఎవరో తెలుసా?