Goat OTT: 'గోట్' ఓటీటీ రిలీజ్... ఈ వారమే నెట్‌ఫ్లిక్స్‌లో దళపతి విజయ్ సినిమా, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Goat OTT Release Date: దళపతి విజయ్, వెంకట్ ప్రభు కలయికలో వచ్చిన 'ది గోట్' ఓటీటీ విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ (Thalapathy Vijay) డ్యూయల్ రోల్ చేసిన లేటెస్ట్ సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' (Goat Movie). సెప్టెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి, ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ రోజు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ 3వ తేదీ నుంచి!
Goat Movie OTT Platform: ది గోట్... 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' సినిమాకు మూవీ టీం పెట్టిన పేరు. థియేటర్లలో పాన్ ఇండియా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలో కూడా అంతే! పాన్ ఇండియా భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు, హిందీ భాషలతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
'ది గోట్' సినిమాలో హీరో విజయ్ పేరు ఏంటో తెలుసా? గాంధీ! ఈ సినిమా ట్రైలర్ గనుక మీరు చూస్తే... ''చాలా మంది గాంధీ వేషాలు వేయడం చూశా. ఇప్పుడు గాంధీ వేషం వేయడం చూస్తున్నా'' అని విలన్ చెబుతాడు. అక్కడ గాంధీ అంటే మన జాతిపిత మహాత్మా గాంధీ కాదు... హీరో విజయ్ అన్నమాట! ఈ సినిమాలో మహాత్మా గాంధీ - జవహర్ లాల్ నెహ్రూ - సుభాష్ చంద్ర బోస్ పేర్లు మీద ఒక కామెడీ ట్రాక్ ఉంది. గాంధీగా డిజిటల్ స్క్రీన్ మీదకు విజయ్ వచ్చేది కూడా గాంధీ జయంతి తర్వాత రోజైన అక్టోబర్ 3న కావడం విశేషం.
Ever seen a lion become a G.O.A.T?! 👀💥
— Netflix India South (@Netflix_INSouth) October 1, 2024
Thalapathy Vijay’s The G.O.A.T- The Greatest Of All Time is coming to Netflix on 3 October in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi 🐐🔥#TheGOATOnNetflix pic.twitter.com/5mwZ2xdoSo
తమిళనాడులో సూపర్ హిట్... తెలుగు, మళయాళంలో ఫ్లాప్!
'ది గోట్' తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తమిళ వెర్షన్ కలెక్షన్స్ 200 కోట్ల కంటే ఎక్కువ. కానీ, ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు ఏపీ - తెలంగాణ, కేరళలో సేమ్ మేజిక్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. తెలుగు, మలయాళ భాషల్లో ఫ్లాప్ టాక్ అందుకుంది. సినిమా విడుదలైన తర్వాత కథలో 'చెన్నై సూపర్ కింగ్స్' కనెక్ట్ ఉండటంతో తెలుగు, మలయాళ ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ కాలేదని చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు కామెంట్ చేశారు.
Also Read: ఆస్పత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్... హెల్త్ అప్డేట్ ఇచ్చిన సతీమణి లత
తెలుగులో 'ది గోట్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాలో విజయ్ సరసన సీనియర్ హీరోయిన్ స్నేహ నటించారు. యంగ్ విజయ్ జోడీగా మీనాక్షీ చౌదరి కనిపించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ హీరో ప్రభుదేవా, 'జీన్స్' ప్రశాంత్, అజ్మల్ అమీర్, జయరామ్, లైలా ఇతర కీలక పాత్రలు చేశారు. ప్రేమ్ జి అమరన్, వైభవ్, వీటీవీ గణేష్ సినిమాలో ఉన్నా... కామెడీ అంతగా క్లిక్ కాలేదు.