అన్వేషించండి

NCET 2024 Notification: జాతీయ విద్యాసంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులు - నోటిఫికేషన్, పరీక్ష వివరాలు ఇలా

NCET 2024: దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్‌ వర్సిటీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 'నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024' నోటిఫికేషన్‌ను ఎన్టీఏ ఇటీవల విడుదల  చేసింది.

NCET-2024 Notification: దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్‌ వర్సిటీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికిగాను 'నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET)-2024' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల విడుదల  చేసింది. ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 13న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP) బీఈడీ సీట్లను భర్తీ చేస్తాయి. 

ఈ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు. కేవలం ఇంటిగ్రేటెడ్ కోర్సులకు మాత్రమే ఎన్‌సీఈటీ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 64 విద్యాసంస్థలు ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును అందిస్తున్నాయి. వాటిల్లో మొత్తం 6,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో ఉర్దూ వర్సిటీ (150 సీట్లు), వరంగల్ ఎన్‌ఐటీ (50), లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (50)లో సీట్లు ఉన్నాయి. ఇక ఏపీలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(తిరుపతి)-50 సీట్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ (ఎచ్చెర్ల-శ్రీకాకుళం)-50 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

వివరాలు...

* నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET)-2024

కోర్సులు..

➥ బీఏ-బీఈడీ

➥ బీఎస్‌ఈ-బీఈడీ

➥ బీకాం-బీఈడీ

సీట్ల సంఖ్య: 6100. (తెలంగాణ-200, ఏపీ-100)

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.1200; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.650 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా.

రాతపరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 181 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో తప్పనిసరిగా 160 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు. పరీక్షలో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1(లాంగ్వేజ్)లో 23 ప్రశ్నల్లో-20 ప్రశ్నలకు, సెక్షన్-2(స్పెసిఫిక్ సబ్జెక్ట్)లో 28 ప్రశ్నల్లో-25 ప్రశ్నలకు, సెక్షన్-3(జనరల్ టెస్ట్)లో 28 ప్రశ్నల్లో-25 ప్రశ్నలకు, సెక్షన్-4(టీచింగ్ ఆప్టిట్యూడ్)లో 23 ప్రశ్నల్లో-20 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో సెక్షన్‌లో మూడు ప్రశ్నలు ఛాయిస్ ఇస్తారు.

పరీక్ష సిలబస్..

⫸ లాంగ్వేజ్ విభాగంలో రీడింగ్ కాంప్రహెన్షన్, లిటరరీ ఆప్టిట్యూడ్, వొకాబులరీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

⫸ డొమైన్ ఇంటర్ సబ్జెక్టుల స్థాయిలో ప్రశ్నలు అడగుతారు. 

⫸ జనరల్ టెస్ట్ విభాగంలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఆఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

⫸ టీచింగ్ ఆప్టిట్యూడ్ విభాగంలో సైన్స్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్, లాంగ్వేజెస్ తదితర అంవాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.04.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2024.(up to 11:30 P.M.)

➥ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 30.04.2024 (up to 11:50 P.M.)

➥ దరఖాస్తుల సవరణ: 02.05.2024 - 04.05.2024.

➥ సిటీ ఇంటిమేషన్ ప్రకటన: 2024, మే చివరివారంలో.

➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: ప్రవేశ పరీక్షకు 3 రోజుల ముందుగా.

➥ ప్రవేశ పరీక్ష తేది: 12.06.2024.

Notification

PUBLIC NOTICE

Online Registration

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Pushpa 2 Music Director: ‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
Prabhas: ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
Appudo Ippudo Eppudo OTT: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
US President News: ప్రచార వ్యూహకర్తకు కీలక బాధ్యతలు- సూసీ వైల్స్‌ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించిన ట్రంప్‌
ప్రచార వ్యూహకర్తకు కీలక బాధ్యతలు- సూసీ వైల్స్‌ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించిన ట్రంప్‌
Embed widget