Stocks to watch 20 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - భారీ పెట్టుబడుల్లో DLF
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 20 March 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 103 పాయింట్లు లేదా 0.60 శాతం రెడ్ కలర్‌లో 17,059 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
DLF: గురుగావ్‌ల కొత్త లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి రాబోయే నాలుగు సంవత్సరాల్లో దాదాపు రూ. 3,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు ఉన్న బలమైన డిమాండ్ నుంచి లాభపడడానికి ప్రయత్నిస్తోంది.
కాన్ ఫిన్ హోమ్స్: కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (MD &CEO) గా సురేష్ శ్రీనివాసన్ అయ్యర్‌ను నియమించింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వచ్చింది.
బ్లిస్ GVS ఫార్మా: పాల్ఘర్‌లోని ఈ కంపెనీ తయారీ యూనిట్‌లో తనిఖీ నిర్వహించిన యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA), మూడు 3 పరిశీలనలు జారీ చేసింది.
ఫెడరల్ బ్యాంక్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన రూ. 1,000 కోట్ల వరకు సేకరించబోతోంది. ఇందుకోసం, అసురక్షిత బేసెల్ III కంప్లైంట్ టైర్-II సబార్డినేట్ బాండ్‌లను జారీ చేయడానికి ఫెడరల్ బ్యాంక్ బోర్డ్ ఆమోదించింది.
గోదావరి పవర్ & ఇస్పాత్: రూ. 5 ముఖ విలువ కలిగిన 50,00,000 ఈక్విటీ షేర్లను రూ. 250 కోట్లకు మించకుండా బైబ్యాక్ చేసే ప్రతిపాదనను ఈ కంపెనీ బోర్డు ఆమోదించింది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (FPIలు) వాన్‌గార్డ్, నార్వేజియన్ నార్జెస్ బ్యాంక్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో వాటాలను కైవసం చేసుకున్నాయి. ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్లను కొన్నాయి.
డెలివెరీ: లాజిస్టిక్స్ కంపెనీ డెలివెరీలో 0.75% వాటాకు సమానమైన 55.13 లక్షల షేర్లను టైగర్ గ్లోబల్ ఆఫ్‌లోడ్ చేసింది. శుక్రవారం బహిరంగ మార్కెట్ ద్వారా షేర్లను అమ్మి సుమారు రూ. 177 కోట్లను సమీకరించింది.
BPCL: 93,561 అన్‌సెక్యూర్డ్, లిస్టెడ్, రేటెడ్, నాన్ క్యుములేటివ్, రిడీమబుల్, నాన్ కన్వర్టబుల్, ట్యాక్స్‌బుల్, డిబెంచర్‌లను జారీ చేసిన రూ. 935 కోట్లు సమీకరించింది. ఒక్కో డిబెంచర్‌ను రూ. 1,00,000 ముఖ విలువతో జారీ చేసింది.
హిటాచీ ఎనర్జీ: ఈ కంపెనీ సాఫ్ట్‌వేర్ హ్యాకింగ్‌కు గురైంది. అయితే, నెట్‌వర్క్ కార్యకలాపాలు లేదా కస్టమర్ డేటా భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని తమ దర్యాప్తులో తేలిందని ఈ కంపెనీ ప్రకటించింది.
రైల్ వికాస్ నిగమ్: HORC ప్రాజెక్టులో రూ. 1,088 కోట్ల విలువైన కొత్త BG రైల్వే లైన్‌కు సంబంధించి రైలు వికాస్ నిగమ్ అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది.
HDFC: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిబంధనలను పాటించనందుకు HDFC పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 5 లక్షల జరిమానా విధించింది.
అతుల్ ఆటో: ముంబైకి చెందిన స్టార్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా వారెంట్లను ఈక్విటీ షేర్లుగా మార్చడం ద్వారా ఈ స్మాల్ క్యాప్ ఆటో స్టాక్‌లో మరో 7.05% వాటా కైవసం చేసుకున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.