అన్వేషించండి

Today Horoscope in Telugu : మార్చి 28 రాశి ఫలాలు (28/03/2024) - ఈ రాశులవారు వివాదాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు!

Horoscope Prediction 28th March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Daily Horoscope for March 28th 2024   

మేష రాశి
వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసేందుకు ఇదే మంచి సమయం. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. మీ సహోద్యోగులను చూసి అసూయపడకండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మంచిరోజు. మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

మిథున రాశి
ఈ రాశి ఉద్యోగులు పనిపట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇంటి ఖర్చులు పెరగడం వల్ల మీపై ఒత్తిడి ఉంటుంది.  పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రతికూల స్వభావం గల వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలను తెంచుకోవడం మంచిది. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి.  

Also Read: మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 ఏప్రిల్ to 2025 మార్చి!

కర్కాటకరాశి
కమీషన్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిభ ప్రదర్శించేందుకు ఈ రోజు మంచిరోజు. పనిపట్ల నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు, వాయిదా వేయొద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. కుటుంబానికి సమయం కేటాయించాలి. 

సింహ రాశి
ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రత్యేక అంశాల అధ్యయనంపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార పర్యటన ఉండవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్వూలకు హాజరవుతారు. పాత పెట్టుబడుల నుంచి ఆకస్మిక లాభాలు పొందుతారు. అనవసరమైన వాదనలకు కూడా దూరంగా ఉండడం మంచిది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. 

కన్యా రాశి
మీ జీవిత భాగస్వామి పట్ల గౌరవంగా ఉండండి. మాట్లాడేవిధానం మార్చుకుంటే కుటుంబంలో సగం సమస్యలు తగ్గుతాయని గుర్తించాలి. ఆర్థిక సంబంధిత పనులలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. వివిధ మార్గాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.  చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.  

Also Read: Ugadi Astrological Prediction 2024-2025: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!

తులా రాశి
మీ ప్రవర్తన స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పరిశోధనలో ఆశించిన విజయం లభిస్తుంది. నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు మీపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. గతం గురించి పదే పదే ఆలోచించవద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

వృశ్చిక రాశి
ఉద్యోగులు పనిపట్ల నిర్లక్ష్యం వహించవద్దు.. అనవసర ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల విషయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య  సమతుల్యతను కొనసాగించేలా చూసుకోండి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఈ రోజు అనవసర వాదనలు పెట్టుకోవద్దు. 

ధనుస్సు రాశి
తొందరపడి పనులు పూర్తి చేయడం వల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.   అలసిపోయినట్టు అనిపిస్తుంది. స్నేహితుల సహకారంతో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోతారు.  కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. 

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

మకర రాశి
మీరు ఆర్థిక విషయాల్లో విజయం పొందుతారు. మీ ప్రతిభను, సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ  సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించండి. స్నేహితుల నుంచి వ్యాపార ప్రతిపాదనను అందించవచ్చు. ప్రేమ జీవితం ఈ రోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

కుంభ రాశి 
ఈ రాశివారు ఈరోజు ఆందోళనలో ఉంటారు. రహస్య ప్రేమ వ్యవహారాలు బయటపడతాయనే భయం వీరిలో ఉంటుంది. కాస్త ఓపికగా వ్యవహరించడం మంచిది. మనసులో వ్యతిరేక ఆలోచనలు తలెత్తవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.

మీన రాశి
నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు.  మీ ప్రతిభ ప్రదర్శించేందుకు మంచి సమయం. ఉద్యోగులు తమ పనికి తగిన ప్రశంసలు పొందుతారు. వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి సారిస్తారు. ప్రతికూల ఆలోచనలు దూరం చేసుకుంటే మంచిది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note:  ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget