అన్వేషించండి

YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల

Andhra Pradesh News | వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డి మీద సోషల్ మీడియాలో చేసిన అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరమని, అలాంటి వాళ్లను ఉరితీసినా తప్పులేదంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలా రెడ్డి అన్నారు.

Chebrolu Kiran Arrest | అమరావతి: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి మీద టీడీపీ కార్యకర్త చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పార్టీ పరంగానూ అతడిపై టీడీపీ నిర్ణయం తీసుకుని సస్పెండ్ చేయగా, పోలీసులు చేబ్రోలు కిరణ్ ను గురువారం అరెస్ట్ చేశారని తెలిసిందే. ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల  ఘాటుగా స్పందించారు. వైఎస్ భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అన్నారు.

మన రాష్ట్రంలో నీచపు వ్యవస్థ
‘ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదు. ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలి. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలే.

అక్రమ సంబంధాలు అంటగట్టారు

 సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి’ అని షర్మిల పిలుపునిచ్చారు.

వైసీపీ శ్రేణులు మండిపాటు
టీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతీరెడ్డి మీద దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. దానిపై సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో చేసిన తప్పు తెలుసుకున్న అతడు భారతీరెడ్డికి క్షమాపణ సైతం చెప్పాడు. ఆడవారిని అలా అనడం తప్పేనని, ఇంకెప్పుడూ అలాంటి పనులు చేయనంటూ ఓ వీడియో విడుదల చేశాడు. అయితే పార్టీకి చెందిన వ్యక్తి ఓ మహిళ, అందులోనూ మాజీ సీఎం సతీమణిపై తీవ్ర పదజాలం వాడాడంటూ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి చేబ్రోలు కిరణ్ ను సస్పెండ్ చేశారు. అనంతరం అతడిపై నమోదైన కేసులో అరెస్ట్ చేశారు. మొదట క్షమాపణ చెప్పాలని, లేకపోతే చంపేస్తామని వైసీపీ శ్రేణులు చేబ్రోలు కిరణ్‌ను బెదిరించాయి. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు టీడీపీతో పాటు కూటమి నేతల్ని ఏకిపారేశారు. ఆడవారికి ఇచ్చే గౌరవం ఇదేనా, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఘాటుగా స్పందిస్తున్న కూటమి శ్రేణులు..
ఎవరో ఒక కార్యకర్త పిచ్చిపిచ్చి కూతలు కూస్తేనే మేం చర్యలు తీసుకున్నాం. కానీ అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి మీద చేసిన దారుణమైన వ్యాఖ్యలు మరిచిపోయారా.. ఆ సమయంలో ఇది తప్పు అని ఎందుకు ఖండించలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తమ వరకు వస్తే గానీ సమస్య, దాని తీవ్రత తెలిసి రాదా అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అయినా తాము జరిగిన దాన్ని వైసీపీ అధినేత జగన్ లా సమర్థించకుండా.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేశామని చెబుతున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget