Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
Tamilnadu: అన్నాడీఎంకే ఎన్డీఏలోచేరింది. పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్ షా ప్రకటించారు. అన్నాడీఎంకే మాజీ నేతను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నిర్ణయించారు.

AIADMK joins NDA: తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే పూర్తి స్థాయి ఎన్నికల వాతావరణ ఆ రాష్ట్రంలో ఏర్పడింది. అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏలో చేరింది. గత ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేశాయి. తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై దూకుడుగా వెళ్లడంతో అన్నాడీఎంకే దూరం అయింది. ఇప్పుడు మళ్లీ అన్నామలైను తప్పించి అన్నాడీఎంకేను ఎన్డీఏలోకి బీజేపీ ఆహ్వానించింది.
చెన్నైలో హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పళనిస్వామితో చర్చల అనంతరం అమిత్ షా పొత్తు విషయాన్ని ప్రకటించారు. తమ కూటమి సీఎం అభ్యర్థిగా పళని స్వామి ఉంటారని తెలిపారు. పొత్తులకు ఎలాంటి షరతులు లేవన్నారు. ఈ పొత్తుకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా నైనార్ నాగేంద్ర అనే నేతను ఎంపిక చేసినట్లుగా అమిత్ షా ట్వీట్ చేశారు. నైనార్ నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ వేశారని ఆయననే తమిళనాడు అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లుగా చెప్పారు.
ఈ నైనార్ నాగేంద్రన్ అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత. జయలలిత అన్నాడీఎంకేలో ఉన్నప్పుడు ఆమెకు నమ్మకస్తురాలిగా కీలక నేతగా ఉన్నారు. తిరునల్వేలిలో బలమైన నేతగా ఎదిగారు. 2001-2006 మధ్య జయలలిత, ఓ. పన్నీర్ సెల్వం నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. జయలలిత మరణం తర్వాత బీజేపీలో చేరారు. వెంటనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తిరునెల్వేలి నుండి అన్నాడీఎంకే మద్దతుతో గెలిచారు. ప్రస్తుతం బీజేపీ శాసనసభ్యుల నాయకుడిగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ఉండాలంటే అన్నామలై బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే సాధ్యం కాదని అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి స్పష్టం చేయడంతో హడావుడికి ఆయనను తప్పించింది బీజేపీ హైకమాండ్.
🚨 BIG BREAKING NEWS
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 11, 2025
AIADMK joins NDA — will fight assembly elections with BJP & other alliance partners, confirms Amit Shah 🔥
— BJP & AIADMK alliance could prove to be a GAME CHANGER in the Tamil Nadu assembly election 🎯 pic.twitter.com/P00vfUxI1F
అన్నాడీఎంకే, విజయ్ టీవీకే పార్టీల మధ్య పొత్తును పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే పళనిస్వామికి సీఎం పోస్టు ఇవ్వాలన్న ప్రతిపాదన రావడంతో విజయ్ ఆసక్తి చూపలేదు. అదే సమయంలో బీజేపీ మళ్లీ అన్నాడీఎంకేను తమ కూటమిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. అన్నామలై మాత్రమే అడ్డమని పళని స్వామి చెప్పడంతో ఆ మేరకు ఆయనను తప్పించి మాజీ అన్నాడీఎంకే నేతకు చాన్సిచ్చి.. పొత్తులు ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో మూడు కూటముల పోరాటం ఖాయంగా కనిపిస్తోంది.
The Tamil Nadu BJP has received a nomination for the post of state president only from Shri @NainarBJP Ji.
— Amit Shah (@AmitShah) April 11, 2025
As the President of the Tamil Nadu BJP unit, Shri @annamalai_k Ji has made commendable accomplishments. Whether it is carrying the policies of PM Shri @narendramodi Ji to…





















