అన్వేషించండి

Maruti Wagon R: గ్రాండ్‌ విటారా, డిజైర్‌ స్టైల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు - మారుతి వ్యాగన్‌ ఆర్ గతంలో కంటే సేఫ్‌

Maruti Wagon R Safety Features: ప్రయాణీకుల భద్రత కోసం మారుతి వ్యాగన్ ఆర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫీచర్ ఈ కారులోని అన్ని మోడళ్లలో కనిపిస్తుంది.

Maruti Wagon R Updated Version With 6 Airbags: మన దేశంలో జనం ఎక్కువగా కొంటున్న కార్లలో మారుతి వాగన్ ఆర్ ఒకటి. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్‌ కారణంగా ఇది కామన్‌ మ్యాన్‌ కార్‌ అని గుర్తింపు తెచ్చుకుంది. ఈ జపనీస్ వెహికల్‌ కంపెనీ, మారుతి వ్యాగన్‌ ఆర్‌ను మునుపటి కంటే సురక్షితంగా మారుస్తోంది. దీనివల్ల, ఈ ఫ్యామిలీ కార్‌లో ప్రయాణించే కుటుంబ సభ్యులందరికీ భద్రత ఉంటుంది.

గతంలో, వ్యాగన్ R డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్‌లు (ముందు వైపు) మాత్రమే ఉండేది. ఇప్పుడు, ఈ కారులో భద్రతను మరో లెవల్‌కు పెంచుతూ, మారుతి, 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించనుంది. వ్యాగన్ R అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు అమరుస్తారు. ఇటీవలే, మారుతి గ్రాండ్ విటారాలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు ‍‌(Airbags in Maruti Grand Vitara) ఏర్పాటు చేసి, సేఫ్టీ ఫీచర్స్‌ను అప్‌ స్టేజ్‌కు అప్‌డేట్‌ చేశారు. స్విఫ్ట్‌ డిజైర్‌లోనూ ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు (Airbags in Maruti Suzuki Dzire) ఉన్నాయి.

కొత్త మారుతి వాగన్ R ధర ఎంత? ‍‌(new Maruti Wagon R Price)
మారుతి వ్యాగన్ R అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ ‍‌(Hatchback) కార్‌. వ్యాగన్ R లో 6 ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేసినప్పటికీ, మారుతి ఇంకా ఈ కారు ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఆరు ఎయిర్‌ బ్యాంగ్‌లతో కూడిన వ్యాగన్‌ ఆర్‌ ధర పెంపు గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. అంటే, ఈ ఫ్యామిలీ కార్‌ రేటు పెరుగుతుందా, లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం, దిల్లీలో, మారుతి వ్యాగన్ ఆర్ ఎక్స్ షోరూమ్ ధర ‍‌(Maruti Wagon R X-showroom price in Delhi) రూ. 5.65 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

వాగన్ R పవర్
మారుతి వ్యాగన్ R ను 1197 cc, K12N, 4 సిలిండర్ ఇంజిన్‌తో డిజైన్‌ చేశారు. ఈ ఫోర్‌ వీలర్‌ ఇంజిన్ 6,000 rpm వద్ద 66 kW లేదా 89.73 PS పవర్‌ను & 4,400 rpm వద్ద 113 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ మారుతి కారు ఇంజిన్‌తో AGS (AUTO GEAR SHIFT) ట్రాన్స్‌మిషన్‌ను ఇన్‌స్టాల్ చేశారు. మారుతి వాగన్ R కారు తొమ్మిది వేరియంట్లలో మార్కెట్లోకి వస్తుంది.

వాగన్ R ఫీచర్లు (Maruti Wagon R Features)
కొత్త మారుతి వాగన్ R లుక్‌ బాగుంది, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్‌తో వస్తుంది. డ్రైవింగ్‌ను స్మార్ట్‌గా మార్చేందుకు... స్మార్ట్‌ప్లే నావిగేషన్‌తో పాటు స్మార్ట్‌ప్లే స్టూడియోను కూడా ఇన్‌స్టాల్ చేశారు. మ్యూజిక్‌ లవర్స్‌ కోసం 4 స్పీకర్లు అమర్చారు, లాంగ్‌ డ్రైవ్స్‌లో వీటిని ఫుల్లుగా వాడేసుకోవచ్చు. ఎత్తైన ప్రదేశాలను ఎక్కే సమయంలో వెనక్కు జారిపోకుండా డ్రైవర్‌కు సాయం కోసం వ్యాగన్ ఆర్‌లో హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ (Hill Hold Assist Feature) అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ కారులో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌ల ఫీచర్ కూడా చేర్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Desam Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Desam Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Donald Trump Greenland: ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Japanese Andhra Meals: తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
TGSRTC Medaram Prasadam: మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
Embed widget