TTD News: గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వైసీపీ ఆరోపణ - ఫేక్ ఫోటోలని టీటీడీ ఆగ్రహం - కేసులు పెడతారా?
Tirumala Goshala: తిరుమల గోశాలలో గోవులు చనిపోయాయని వైసీపీ ప్రచారం చేస్తోంది కానీ టీటీడీ ఖండించింది. ఎక్కడివో ఫోటోలు తెచ్చి ప్రచారం చేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.

Tirumala News: టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. టిటిడి గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని.. మృతి చెందిన గోవులు పోటోలు టిటిడి గోశాలకు సంబంధించినవి కావని ప్రకటించింది. దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవులు పోటోలను టిటిడి గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టిటిడి ఖండిస్తోందని తెలిపారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టిటిడి భక్తులను కోరింది.
TTD strongly condemns the spread of false information intended to mislead devotees and the public.
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) April 11, 2025
We request the devotees not to believe false news . #FakeNews #TTDClarification #TTD #DontSpreadRumours #FactCheck pic.twitter.com/OBblgzeVH5
గోశాల గోవథ శాలగా మారింది : భూమన కరుణాకర్ రెడ్డి
అయితే టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గత మూడు నెలలుగా టీటీడీ గోశాలలో 100 కు పై గోవులు మృతి చెందాయన్నారు. డి.ఎఫ్.వో స్థాయి అధికారి గోశాలకు ఇన్చార్జి గా నియమించారు. గోశాల డైరెక్టర్ లేరని.. కూటమి ప్రభుత్వం లో గోశాలలో గోవులకు జరుగుతున్న అన్యాయం ఇదని ఆరోపించారు. 550 ఆవులను సాహి వాల్, గిర్, కాంక్రీజ్ ఆవులను దాతలు ద్వారా రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు నుంచి మా పాలనలో తీసుకు వచ్చామని.. 1500 లీటర్లు పాలు, అన్నప్రసాదాలకు నిత్యం వినియోగించేవారన్నారు. ఇప్పుడు 500 లీటర్లు పాలు కూడా తిరుమలకు వెళ్లడం లేదన్నారు. సాహివాల్ ఆవు గోశాలనుంచి బయటకు వెళ్లి ట్రైన్ కింద పడి చనిపోయిందని.. అది టిటిడి చెందిన కాదని చెప్పేందుకు చెవులు కట్ చేశారని భూమన ఆరోపించారు.
ఎన్.డి.డి.బి సహాయంతో పునరుత్పత్తి కేంద్రం పట్టించుకోలేదు, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ దాదాపు 48 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధం అయ్యారని. గోఆధారిత పంటలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో గోవులను తీసుకు వచ్చామని తెలిపారు. రైతులకు 15వేల కిలోల నెయ్యి రోజుకు అవసరం ఉందన్నారు. తొక్కిసలాట ఘటన లో గోశాల డైరెక్టర్ ను సస్పెండ్ చేశారు. ఎలాంటి సంబందం లేక పోయిన సస్పెండ్ చేశారు డి.ఎఫ్ ఓ ను ఇంచార్జి అధికారిగా గోశాలకు డైరెక్టర్ ను నియమించారని గోశాల.. గోవధశాలగా మారిందన్నారు.
అవాస్తవం అయితే భూమన రాజకీయాల నుంచి వైదొలగాలి : భానుప్రకాష్ రెడ్డి
ధార్మిక క్షేత్రంలో దారుణం జరిగిపోతోందని అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గోవులు బక్కచిక్కి పోయాయి, చనిపోతున్నాయని ఆరోపణలు చేశారని విమర్శించారు. శనివారం టైం చెప్తే గోశాలకు వచ్చి…. నిజానిజాలు తేల్చుకుందామని సవాల్ చేశారు. కరుణాకర్ రెడ్డి మీరు చెప్పింది అసత్యం అయితే రాజకీయం నుంచి తప్పుకుంటారా…? అని ప్రశ్నించారు.
మేము ప్రశ్నిస్తే రోజు ప్రెస్ మీట్లు పెట్టి భానుప్రకాష్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు… భానుప్రకాష్ రెడ్డి లడ్డూలు అమ్ముకున్నాడు అనే అసత్య ఆరోపణలు చేస్తాడని.. మండిపడ్డారు. 1768 గోవులు తిరుపతి గోశాలలో ఉన్నాయి… అనారోగ్య కారణాలతో కొన్ని గోవులు మృతి చెందాయన్నారు. రైల్వే ట్రాక్ పై ఓ గోవు చనిపోయింది… ఆ ఘటనపై టీటీడీ విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోందన్నారు. టీటీడీపై అసత్యాలు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడివో ఫోటోలు తెచ్చి ప్రదర్శించడంతో ఆయనపై తప్పుడు ప్రచారం చేశారని కేసు పెట్టే దిశగా టీటీడీ న్యాయసలహా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

