అన్వేషించండి

Ugadi Rasi Phalalu Sri Krodhi Nama Samvatsara 2024 -2025: మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 ఏప్రిల్ to 2025 మార్చి!

Sri Krodhi Nama Samvatsara Telugu Panchangam 2024 -2025: మేష రాశి నుంచి మీన రాశివరకూ 12 రాశుల వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి....

Ugadi Panchangam  Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025  Yearly Horoscope : 2024 ఏప్రిల్ 09న ఉగాది. ఈ ఏడాది 12 రాశులవారి ఆదాయ-వ్యయాలు, అనుకూలత ప్రతికూలత పాటూ వార్షిక ఫలితాలు ఇక్కడ అందిస్తోంది మీ ఏబీపీ దేశం...

మేష రాశి(అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం) (Mesha Rasi Ugadi Rasi Phalalu 2024 - 2025)

శ్రీ కోధి నామ సంవత్సరంలో మేష రాశివారికి గురు, శని బలం అనుకూల ఫలితాలనిస్తుంది.  ఆదాయం బావుంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆలోచనా విధానం అద్భుతంగా ఉంటుంది. తెలుగు సంవత్సరాది ఆరంభం కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారుతాయి.  వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ( ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) ( Vrishabha Rasi Ugadi Rasi Phalalu 2024 - 2025)

శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశివారికి బాగానే ఉంటుంది. శని, గురు గ్రహాలు అనుకూల స్థానంలో ఉండడం వల్ల మీకు మంచి అనుకూల సమయం. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి.  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులు పొందుతారు. అయితే కొన్ని ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టపోతారు, అపనిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహన ప్రమాదాలున్నాయి జాగ్రత్త.   (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మిథున రాశి (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) (Midhuna Rasi Ugadi Rasi Phalalu 2024 - 2025)

మిథున రాశివారికి గతేడాది కన్నా క్రోథి నామసంవత్సరం  అద్భుతంగా ఉంటుంది. గురుడు, శని , రాహువులు మంచి స్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీ తెలివితేటలతో ఎంతటివారినైనా మెప్పించగలరు. ఆరోగ్యం బావుంటుంది. అప్పుల బాధల నుంచి విముక్తి చెందుతారు. గౌరవం పెరుగుతుంది.  (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

కర్కాటక రాశి (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) (Karkataka Rasi Ugadi Rasi Phalalu 2024 - 2025)

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి అష్టమ శని వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అయితే గురుడు శుభ స్థానంలో ఉండడం వల్ల కష్టాన్ని ఎదుర్కొని దూసుకెళ్లై ధైర్యం మీ సొంతం అవుతుంది. అన్ని రంగాలవారు వృద్ధిలోకి వస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వివైహిక దీ గురుడు శుభస్థానంలో ఉన్నందుకు ఎంత కష్టమైన పనులనైనా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలరు. (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) (Simha Rasi Ugadi Rasi Phalalu 2024 - 2025)

సింహరాశివారికి ఈ ఏడాది మనోబలమే కానీ గ్రహబలం అంతగా లేదు. అష్టమంలో రాహువు, దశమంలో గురువు మిమ్మల్ని అష్టకష్టాల పాలు చేస్తారు. ఏ పని ప్రారంభించినా పోరాటం చేస్తేకానీ ఫలితం సాధించలేరు. అనారోగ్య సమస్యలుంటాయి. అనవసర వివాదాలు వెంటాడుతాయి. ఆదాయం బాగానే ఉన్నా మనశ్సాంతి ఉండదు. మీ తెలివితేటలు, ఆత్మవిశ్వాసమే ముందుకి నడిపిస్తుంది.  .(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం సింహ రాశి వార్షిక ఫలితాల కోసంఈ లింక్ క్లిక్ చేయండి)

కన్యా రాశి (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు) (Kanya Rasi Ugadi Rasi Phalalu 2024 - 2025)

ఈ రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలనిస్తోంది. బయటకు గంభీరంగా కనిపిస్తారు కానీ లోలోపల భయం వెంటాడుతుంది. ఎలాంటి తప్పు లేకపోయినా మాటలు పడతారు, డబ్బు సమయానికి చేతికి అందదు. సొంత పనుల కన్నా ఇతరుల పనులపై శ్రద్ధ పెరుగుతుంది. మీ నుంచి ఉపకారం పొందినవారే మీకు కీడు చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.  (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  కన్యా రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

తులా రాశి  (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు) (Tula Rasi Ugadi Rasi Phalalu 2024 - 2025)

తులా రాశివారికి ఈ ఏడాది  దైవబలం కలిసొస్తుంది. ఏ పని అనుకున్నా ఎంచక్కా పూర్తిచేసేస్తారు.  వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. అవమానాలు,అపనిందలు ఎదురైనా వాటిని అధిగమించి దూసుకెళ్తారు. ఎనిమిదో స్థానంలో గురుడు సంచారం వల్ల కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది.   (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం తులా రాశి వార్షిక  ఫలితాల కోసంఈ లింక్ క్లిక్ చేయండి)

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) (Vrishchika Rashi Ugadi Rasi Phalalu 2024 - 2025)

గడిచిన ఏడాది కన్నా శ్రీ క్రోధి నామ సంవత్సరం వృశ్చిక రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. ఏడో స్థానంలో ఉన్న గురుడు మిమ్మల్ని వృత్తి వ్యాపారాల్లో మంచి స్థానంలో నిలబెడతాడు. గతేడాది ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది. ఏలినాటి ఇంకా ఉన్నప్పటికీ ఆ ప్రభావం పెద్దగా ఉండదు. మానసిక ధైర్య మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు వస్తాయి అవే సర్దుకుంటాయి.  (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం వృశ్చిక రాశి వార్షిక  ఫలితాల కోసంఈ లింక్ క్లిక్ చేయండి)

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) (Dhanassu Rashi Ugadi Rasi Phalalu 2024 - 2025)

ధనస్సు రాశివారికి  శ్రీ క్రోధి నామ సంవత్సరం మంచి ఫలితాలనే ఇస్తుంది. ఆదాయం బావుంటుంది కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. బంధు మిత్రుల్లో ఆదరణ పెరుగుతుంది. మీ వ్యవహారాల కన్నా ఇతరుల విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కొన్ని సమస్యలు వెంటాడినా గురుబలం వల్ల ఆఖరి నిముషంలో బయటపడతారు.  (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం ధనస్సు రాశి వార్షిక  ఫలితాల కోసంఈ లింక్ క్లిక్ చేయండి)

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) (Makara Rashi Ugadi Rasi Phalalu 2024 - 2025)

మకర రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం మంచి ఫలితాలనే ఇస్తోంది. ఏ పనినైనా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది. ఆదాయంతో పాటూ ఖర్చు కూడా పెరుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ప్రయాణ సమయంలో జాగ్రత్త అవసరం.  (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం మకర రాశి వార్షిక  ఫలితాల కోసంఈ లింక్ క్లిక్ చేయండి)

కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు) (Kumbha Rashi Ugadi Rasi Phalalu 2024 - 2025)

కుంభ రాశివారికి  శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సెప్టెంబరు వరకూ అన్ని విధాలా కలిసొస్తుంది. కష్టమైన పనులైనా పూర్తిచేస్తారు,ఆదాయం బాగానే ఉంటుంది. సెప్టెంబరు నుంచి చికాకులు , అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని భయం, ఏం మాట్లాడినా వివాదాలు, పనిలో అడ్డంకులు మొదలవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేరు.  (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం కుంభ రాశి వార్షిక  ఫలితాల కోసంఈ లింక్ క్లిక్ చేయండి)

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) (Meena Rashi Ugadi Rasi Phalalu 2024 - 2025)

మీన రాశివారికి  శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఎలినాటి శని ఉన్నా గురుబలం మంచి ఫలితాలను అందిస్తోంది. స్త్రీ మూలకంగా మీ జీవితంలో వెలుగు వస్తుంది. ఏడాది ఆరంభంలో సమస్యలన్నా ద్వితీయార్థం బావుంటుంది. పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతాయి. (మీన రాశి వార్షిక ఫలితాలు పూర్తిగా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Also Read: Ugadi Astrological Prediction 2024-2025: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget