అన్వేషించండి

Ugadi Rasi Phalalu 2024 to 2025 Telugu : శ్రీ క్రోధి నామ సంవత్సర మిథున రాశి ఫలితాలు - ఉగాది రాశిఫలాలు 2024 to 2025

Happy Ugadi : శ్రీ శోభకృత్ నామసంవత్సరం పూర్తి చేసుకుని శ్రీ క్రోధినామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ ఏడాది మిథన రాశివారి ఆదాయ వ్యయాలు , వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి...

Ugadi Panchangam  Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Gemini Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం మిథున రాశి ఫలితాలు

మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 6

  • మిథున రాశివారికి గతేడాది కన్నా క్రోథి నామసంవత్సరం అత్యంత యోగకాలం. 
  • బుధ్ది, ధనం, కుటుంబ కారకుడు అయిన గురుడు బలమైన స్థానంలో ఉన్నాడు...శని, రాహువులు కూడా మంచి స్థానంలో ఉండడం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఏ పని చేసినా మంచి ఫలితాలు పొందుతారు.
  • జీవిత భాగస్వామితో కలసి ఏ కార్యం తలపెట్టినా విజయం సాధిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు
  • కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు
  • మీ తెలివితేటలతో ఎంతటి వారినైనా మెప్పించగలరు
  • గతంలో చేసిన అప్పల బాధల నుంచి విముక్తి పొందుతారు, ఆదాయం వృద్ధి చెందుతుంది
  • ఇంటా -బయటా మీ గౌరవం పెరుగుతుంది

ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రీ క్రోథి నామ సంవత్సరం - మిథున రాశి ఉద్యోగులకు

మిథున రాశి ఉద్యోగులకు ఈ ఏడాది అత్యంత అనుకూలమైన సమయం. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సిన చోటుకి బదిలీలు జరుగుతాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. నిరుద్యోగులు ఈ ఏడాది సౌకర్యవంతమైన ఉద్యోగంలో స్థిరపడతారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పర్మినెంట్ జరిగే అవకాశం ఉంది. ప్రేవేటు ఉద్యోగులు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు

శ్రీ క్రోథి నామ సంవత్సరం - మిథున రాశి వ్యాపారులకు 

ఈ రాశికి చెందిన అన్ని రకాల వ్యాపారులకు యోగకాలమే. కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించినా లాభపడతారు. హోల్ సేల్, రీటైల్ వ్యాపారులు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు చెందిన కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు వస్తాయి. 

ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రీ క్రోథి నామ సంవత్సరం - మిథున రాశి రాజకీయ నాయకులకు

మిథున రాశి రాజకీయ నాయకులకు శనిబలం కలిసొస్తుంది.ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీలో మంచి పదవి పొందుతారు. ఎన్నికలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రజల్లో, అధిష్టాన వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ధనం మంచి నీళ్లలా ఖర్చవుతుంది.

శ్రీ క్రోథి నామ సంవత్సరం - మిథున రాశి కళాకారులకు

మిథున రాశి కళాకారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని ఇబ్బందులున్నప్పటకీ ఆదాయానికి లోటుండదు. నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోతాయి. టీవీ, సినిమా రంగంలో ఉన్న వారు నూతన గృహనిర్మాణ యత్నాలు కలిసొస్తాయి

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

శ్రీ క్రోథి నామ సంవత్సరం - మిథున రాశి విద్యార్థులు

మిథున రాశి విద్యార్థులకు క్రోధి నామ సంవత్సరం చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. కష్టపడి చదివితేనే మంచి మార్కులు సాధిస్తారు. విదేశీ చదువులు లాభిస్తాయి. ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ఫలితాలే సాధిస్తారు. కోరుకున్న కళాశాలలో సీట్లు సాధిస్తారు. కళాకారులకు యోగకాలం..విజయాలు,అవార్డులు లభిస్తాయి

ఓవరాల్ గా చెప్పుకుంటే మిథున రాశివారికి అన్ని విధాలా కలిసొచ్చే సమయం. గతేడాది కన్నా మెరుగ్గా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలకు తోడు గ్రహబలం కూడా కలిసి రావడం వల్ల మంచి ఫలితాలే సాధిస్తారు. 

Also Read:  మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget