Happy Ugadi Wishes in Telugu 2024: మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
ఉగాది 2024: మీ బంధుమిత్రులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

Ugadi Wishes in Telugu 2024
చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ
చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అని, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. ఉగాది పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
మీరు తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను
విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఈ ఉగాది మీకు ఆరోగ్యం, సంపద, ఆనందం ఇవ్వాలని కోరుకుంటూ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఉగాది వెలుగులు మీ జీవితంలో నూతన కాంతిని తెస్తాయని ఆశిస్తూ
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు!
ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలి
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
గతించిన కాలాన్ని వదిలేసి...
నూతన ఏడాదికి ఘన స్వాగతం పలకాలి
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
శ్రీ క్రోధి నామ సంవత్సరం మీకు మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
తీపి-చేదు కలిసినదే జీవితం
కష్టం-సుఖం తెలిసినదే జీవితం
ఈ ఉగాది మీ ఇంట ఆనందాన్ని నింపాలి
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
మధురమైన ఈ క్షణం నిలుస్తుంది జీవితాంతం
ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలెన్నో మీకు అందించాలని కోరుకుంటూ
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
మామిడి చెట్టు పూతొచ్చింది
కోయిల గొంతుకు కూతొచ్చింది
వేప కొమ్మకు పూవు పూసింది
పసిడి బెల్లం తోడు వచ్చింది
గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది
ఉగాది పండుగ వచ్చేసింది
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది..
ఈ ఏడాది మీకు అన్నీ విజయాలే కలగాలని ఆశిస్తూ..
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు